spot_img
Homeక్రీడలుక్రికెట్‌SRH Vs RR: సెంచరీ మిస్..కానీ, రాజస్థాన్ అంటే చాలు అతడి బ్యాట్ అమాంతం లేస్తుంది..

SRH Vs RR: సెంచరీ మిస్..కానీ, రాజస్థాన్ అంటే చాలు అతడి బ్యాట్ అమాంతం లేస్తుంది..

SRH Vs RR: గొప్పగా అంచనాలు పెట్టుకున్న అభిషేక్ శర్మ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఇదే అదునుగా రాజస్థాన్ బౌలర్లు రెచ్చిపోయారు. రెడ్ సాయిల్ పిచ్ మీద కఠినమైన బంతులు వేశారు. దీంతో తొలి మూడు ఓవర్ల వరకు ఆశించిన స్కోర్ రాలేదు. ఒకానొక దశలో ప్రమాదకరమైన హెడ్, కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత గేమ్ ప్లాన్ మొత్తం మారిపోయింది.

ప్రమాదకరమైన హెడ్ (18) తన స్థాయి బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ దశలో జట్టు భారాన్ని మొత్తం ఇషాన్ కిషన్ (91) మోయాల్సి వచ్చింది. 44 బంతులు ఎదుర్కొన్న అతడు ఎనిమిది ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 91 పరుగులు చేశాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఉన్నంత సేపు రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 0 పరుగులకు తొలి వికెట్, 55 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు.

క్లాసెన్ (40)తో కలిసి ఇషాన్ కిషన్ మూడో వికెట్ కు 39 బంతుల్లో 88 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యం హైదరాబాద్ జట్టుకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అందువల్లే హైదరాబాద్ జట్టు 217 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు ముందు ఉంచింది. ఒకవేళ కిషన్ గనుక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే హైదరాబాద్ స్కోర్ మరింత పెరిగేది.. వాస్తవానికి రాజస్థాన్ జట్టు అంటే చాలు కిషన్ రెచ్చిపోతాడు.

గత ఏడాది రాజస్థాన్ జట్టుమీద బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు కూడా అదే టెంపో కొనసాగించాడు. అయితే దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. ఒకవేళ అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే రాజస్థాన్ ఎదుట హైదరాబాద్ జట్టు కచ్చితంగా 250 కి మించిన టార్గెట్ విధించేది.. ఏది ఏమైనప్పటికీ బీభత్సంగా బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ తొలి బంతికే అవుట్ అయిన నేపథ్యంలో.. జట్టు భారం మొత్తం తనేమోసి.. ఇషాన్ కిషన్ ఆడిన తీరు హైదరాబాద్ అభిమానులకు సరికొత్త ఆనందాన్ని అందించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version