spot_img
Homeఎంటర్టైన్మెంట్Rakasa 10 Days Worldwide Collections: 'రాకాస' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త...

Rakasa 10 Days Worldwide Collections: ‘రాకాస’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Rakasa 10 Days Worldwide Collections: ‘మ్యాడ్’ సిరీస్ తర్వాత సంగీత్ శోభన్(Sangeeth Shobhan) హీరో గా నటించిన ‘రాకాస'(Rakasa Movie) చిత్రం , ఈ నెల 2న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా చాలా సాలిడ్ గానే వచ్చాయి. అదే మొమెంటుమ్ ని వీకెండ్ వరకు కొనసాగించడమే కాదు, వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని కనబర్చింది ఈ చిత్రం. ఓవరాల్ గా 12 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం , ఈ 10 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఎంత వసూళ్లు రావాలి , రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రన్ ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి పది రోజుల్లో 4 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఆంద్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 10 రోజుల్లో 8 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 15 కోట్ల రూపాయిల వరకు వచ్చిందని అంటున్నారు. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో డీసెంట్ స్థాయి టికెట్స్ అమ్ముడుపోయాయి . ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 10 రోజుల్లో ఈ ఛిర్టానికి 2 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టయింది. వరాల గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం కోటి రూపాయిల షేర్ ని రాబడితే చాలు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా నిహారిక కు నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఏ ముహూర్తం లో ఈమె నిర్మాత అయ్యిందో తెలియదు కానీ, పట్టిందల్లా బంగారం లాగా మారిపోతున్నాయి. ఈ సక్సెస్ పరంపర ని ఆమె రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version