SRH vs LSG
SRH vs LSG : గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్(SRH vs LSG) మ్యాచ్ కు ముందు రకరకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లోనే 286 పరుగులు చేసి రికార్డు సృష్టించిన నేపథ్యంలో.. గురువారం ఉప్పల్ స్టేడియంలో లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ 300 స్కోర్ మార్క్ కచ్చితంగా చేరుకుంటుందని అందరూ అంచనా వేశారు. లక్నో జట్టు బౌలింగ్ సరిగ్గా లేదని..సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు దుమ్ము రేపడం ఖాయమని భావించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. మైదానంలో పరుగుల వరద పారుతుందని అందరు భావించారు. కానీ శార్దుల్ ఠాకూర్ (shardul Thakur) రూపంలో హైదరాబాద్ జట్టుకు గట్టి స్ట్రోక్ తగిలింది.
Also Read : ఇదయ్యా బ్రాండ్ అంటే.. ఐపీఎల్ విలువ ఎంతో తెలుసునా?
వేలంలో అమ్ముడుపోని ఆటగాడు..
గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోలేదు. దీంతో లక్నో జట్టులో మోహి సిన్ ఖాన్ గాయపడటంతో.. అతడి స్థానంలో శార్దుల్ కు అవకాశం లభించింది. అయితే దానిని సద్వినియోగం చేసుకున్న శార్దుల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి లక్నో జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. శార్దుల్ దూకుడు వల్ల హైదరాబాద్ జట్టు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఠాకూర్ హైదరాబాద్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. రెండో ఓవర్ లో తొలి బంతికి నికోలస్ పూరన్ పట్టిన క్యాచ్ తో అభిషేక్ శర్మ(6) అవుట్ అయ్యాడు. ఇశాన్ కిషన్ (0) కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. శార్దూల్ వేసిన మూడో బంతిని నితీష్ డిఫెన్స్ ఆడాడు. దీంతో అతడి హ్యాట్రిక్ మిస్ అయింది. అభినవ్ మనోహర్ (2), మహమ్మద్ షమీ(1) వికెట్లను కూడా శార్దూల్ ఠాకూర్ పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు శార్దూల్ ఠాకూర్ సొంతం చేసుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన శార్దూల్ 2 వికెట్లు పడగొట్టాడు. అన్ సోల్డ్ ఆటగాడు అయినప్పటికీ.. అనుకోకుండా లభించిన అవకాశాన్ని శార్దూల్ ఠాకూర్ ఉపయోగించుకున్నాడు.. అయితే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ దూకుడుగా ఆడుతున్న హెడ్(47) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.ఇక 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడిన హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో జట్టు ఎదుట 191 పరుగుల టార్గెట్ విధించింది.
Also Read : టీమిండియా విన్నర్ కు ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదా? ఆశ్చర్యపోయిన సుందర్ పిచాయ్