SRH vs LSG : ఐపీఎల్ ప్లే ఆఫ్ లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. హైదరాబాద్ ధాటిగా ఆడుతోంది. సొంత మైదానంలో లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అసలు సిసలైన పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతడు కోరుకున్నట్టుగా లక్నో జట్టుకు గట్టి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ వేసిన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్ని మొత్తం ప్రదర్శించాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. భువనేశ్వర్ బౌలింగ్ లో క్వింటన్ డికాక్ బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్లాట్ పిచ్ పై బంతులను ఎదుర్కోలేక డిఫెన్స్ ఆడాడు.
ఎట్టకేలకు క్వింటన్ డికాక్ వికెట్ ను భువనేశ్వర్ కుమార్ పడగొట్టాడు. మ్యాచ్ 2.1 ఓవర్ వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో డికాక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. లాంగ్ ఆన్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఆ బంతిని అత్యంత జాగ్రత్తగా ఒడిసి పట్టాడు. దీంతో డికాక్ నిరాశగా మైదానాన్ని వెనుతిరిగి వెళ్ళాడు. ఈ సీజన్లో ప్రమాదకరమైన ఓపెనర్లలో డికాక్ ఒకడు. అయితే ఈ సీజన్లో అస్థిరమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. బుధవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డికాక్ నుంచి లక్నో భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ అతను మాత్రం ఐదు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అప్పటికి లక్నో జట్టు స్కోరు 13 పరుగులు మాత్రమే.
డికాక్ అవుట్ అయిన తర్వాత స్టోయినీస్ క్రీీజు లోకి వచ్చాడు. ఇతడు కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఓటయ్యాడు.. మ్యాచ్ 4.2 ఓవర్ వద్ద సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ షార్ట్ పిచ్ బంతి వేయగా..స్టోయినీస్ దానిని మిడ్ ఆఫ్ లోకి ఆడాడు. అయితే ఆ బంతిని అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి సన్వీర్ సింగ్ క్యాచ్ పట్టాడు. అతడు పట్టిన క్యాచ్ చూసి స్టోయినీస్ ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు. ఆ షాక్ లోనే మైదానం వీడాడు. మరోవైపు లక్నో జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ కమిన్స్ బౌలింగ్లో నటరాజన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రమాదకరమైన కృణాల్ పాండ్య ను కమిన్స్ రన్ అవుట్ చేశాడు. కడపటి వార్తలు అందే సమయానికి 12 ఓవర్లు పూర్తయిన తర్వాత లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. నికోలస్ పురన్, ఆయుష్ బదోని క్రీజులో ఉన్నారు.
The @SunRisers fielding display has been notch so far! #LSG lose Marcus Stoinis inside the powerplay.
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #SRHvLSG pic.twitter.com/7AO2rPUXBJ
— IndianPremierLeague (@IPL) May 8, 2024