SRH Vs KKR: తొలి మ్యాచ్లో 286 పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో 300 స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఈసారి ట్రోఫీ ఎలాగైనా దక్కించుకుంటుందని అంచనా వేశారు. కానీ ఆ తదుపరి మ్యాచ్ లు ఓడిపోతే గాని అర్థం కాలేదు హైదరాబాద్ బ్యాటింగ్ సామర్థ్యం ఎంత దారుణంగా ఉందో.. బ్యాటింగ్ బలంగా లేదు.. బౌలింగ్ లో దృఢత్వం లేదు. ఫీల్డింగ్ లో మెరుపు లేదు. మొత్తంగా హైదరాబాద్ జట్టులో సత్తా లేదు.. సాధారణంగా ఆటగాళ్లలో విశ్వాసం ఉండాలి.. కెప్టెన్ లో సానుకూల దృక్పధం ఉండాలి. కానీ వాటన్నిటిని మర్చిపోయి.. కేవలం 300 ను టార్గెట్ పెట్టుకొని అతి విశ్వాసానికి పోతే.. హైదరాబాద్ జట్టు కొంపముంచుతోంది.. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ ఇదే నిరూపించింది..హెడ్(4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్(2), అనికేత్ వర్మ(6) వంటి ఆటగాళ్లు దారుణంగా విఫలం కావడం హైదరాబాద్ జట్టు బౌలింగ్ లోపాన్ని బయటపెట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని చేదించాలనే తాపత్రయం గాని ఆరాటం గాని ఏ ఒక ఆటగాడిలో ఉన్నట్టు కనిపించలేదు.. ఉన్నంతలో క్లాసెన్, కామిందు మెండీస్ మినహా మిగతావారెవరూ రాణించలేకపోయారు.
Also Read: పాపం కావ్య పాప.. బిక్క ముఖంతో.. గుండెలు తరుక్కుపోతున్నాయ్ రా..
సత్తా చచ్చిపోయిందా
గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది.. ట్రోఫీని కూడా కోల్పోయింది. అయితే ఈ సీజన్లో నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని హైదరాబాద్ జట్టు పై అందరికీ అంచనాలు ఉండేది. కానీ ఆ అంచనాలను హైదరాబాద్ జట్టు అందుకోవడంలో విఫలమైంది. స్లో పిచ్ ను అంచనా వేసిన హైదరాబాద్ కెప్టెన్ టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నాడు.. 10 ఓవర్ల వరకు హైదరాబాద్ మెరుగ్గానే బౌలింగ్ చేసింది. కానీ తర్వాతే బౌలింగ్ లయ పూర్తిగా కోల్పోయింది.. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు కనిపించాయి. కొన్ని క్యాచ్ లను ప్లేయర్లు నేలమట్టం చేయడంతో హైదరాబాద్ వాటికి తగ్గట్టుగానే ప్రతిఫలం పొందింది. జీవధానాలను లభించిన ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మొన్నటిదాకా పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ అయ్యర్ (60), రఘు వంశీ (50) దూకుడుగా ఆడటంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. ఒకానొక దశలో 150 పరుగులకే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఇన్నింగ్స్ ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ పని పట్టడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఇలా ప్రతి విషయంలోనూ హైదరాబాద్ జట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. అతి విశ్వాసానికి పోవడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి ద్వారా హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో పదవ స్థానానికి పడిపోయింది.. మరి తదుపరి మ్యాచ్లో నైనా హైదరాబాద్ తేరుకుంటుందా… ఇదే వైఫల్యాని కొనసాగిస్తుందా.. అనేది చూడాల్సి ఉంది..