Hit 3
Hit 3 : సోషల్ మీడియా యుగంలో సినిమాలకు సంబంధించి ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ని దాచడం అనేది తేలికైన విషయం కాదు, ఎంత దాచాలని చూసినా లీక్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అయితే మరీ దారుణంగా సినిమా విడుదల ముందు రోజే HD పైరసీ లీక్ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు పెద్ద సంక్షోభం లోనే ఉంది. ఎంత మంచి ప్రింట్ లీక్ అయినా పర్వాలేదు, సినిమాని థియేటర్స్ లోనే చూడాలి అని భావించే ఆడియన్స్ వల్ల ఈమధ్య సినిమాలు సేవ్ అవుతున్నాయి కానీ, భవిష్యత్తులో ఎదో ఒక సినిమాపై చాలా బలమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే సినిమాల్లోని కొన్ని ట్విస్టులను లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు దర్శకులు. ఉదాహరణకు ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం లో ప్రభాస్(Rebel Star Prabhas) కర్ణుడు అని, క్లైమాక్స్ లో ఆ రేంజ్ కనిపిస్తాడని విడుదలకు ముందు ఎవరికీ తెలియదు.
Also Read : ‘హిట్ 3’ ప్రపంచం లోకి ‘ఖైదీ’..ఇదేమి ప్లానింగ్ సామీ!
థియేటర్స్ లో ఎప్పుడైతే క్లైమాక్స్ లో ప్రభాస్ ని అలా చూసారో ఆడియన్స్ కి మైండ్ బ్లాస్ట్ అయ్యినంత పని అయ్యింది. సినిమా విడుదల వరకు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ని లీక్ కాకుండా ఎలా చూసారో మిగిలిన దర్శకులు నాగ అశ్విన్(Naga Aswin) దగ్గర కోచింగ్ తీసుకొని ఉండుంటే బాగుండేది. వచ్చే నెల 1వ తారీఖున విడుదల కాబోతున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ‘హిట్ : ది థర్డ్ కేస్'(Hit : The Third Case) మూవీ లో కూడా ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ లో తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi Sivakumar) కనిపించబోతున్నాడు. అంటే ‘హిట్ 4’ మూవీలో అతనే హీరో అన్నమాట. ఇది లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు, కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు ఈ విషయాన్నీ నిన్న సోషల్ మీడియా లో లీక్ చేశారు. దీనిపై ఆ చిత్ర డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు మేము అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించడం కోసం మేమంతా రేయింబవళ్లు శ్రమిస్తూ ఉంటాము. వందలాది మంది నిద్రాహారాలు మానుకొని పని చేస్తుంటారు. మేము ఇంత కష్టపడేది థియేటర్ లో ఆడియన్స్ నుండి వావ్ అని అనిపించుకోవడం కోసమే. అలా కేవలం థియేటర్స్ లో మాత్రమే దక్కే కొన్ని అద్భుతమైన సంఘటనలను లీక్ కాకుండా మేము జాగ్రత్త పడుతూ ఉంటాము. కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు వాటిని లీక్ చేసి ఆడియన్స్ లో థ్రిల్ ఫ్యాక్టర్ ని చంపేస్తున్నారు. ఇంత వయస్సు వచ్చింది, చిన్న పిల్లలు కూడా కాదు, ఇలాంటి విషయాల గురించి బయట చెప్పొచ్చా లేదా అనే ఇంకిత జ్ఞానం వాళ్లకు ఉండాలి. బహుశా వాళ్లకు అలాంటి జ్ఞానం లేదు అనుకుంటా. ఇలాంటివి రిపోర్ట్ చేయడం వల్ల మీరు కేవలం మా కష్టాన్ని దొంగలించిన వాళ్ళు అవ్వడం మాత్రమే కాదు, ఆడియన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ ని కూడా దొంగలిస్తున్నట్టు అర్థం’ అంటూ శైలేష్ ఎంతో ఎమోషనల్ గా వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
Also Read : ఒకడు కాదు ఇద్దరు..’హిట్ 3′ నుండి కీలక ట్విస్ట్ లీక్!
For every single moment of excitement that is experienced in the cinemas by our audience, there is a story of a huge team working relentlessly for days and nights together, slogging beyond their physical capabilities. All for that moment of impact that we want to create in the…
— Sailesh Kolanu (@KolanuSailesh) April 3, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Hit 3 director shailesh angry leaks tweet viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com