SRH vs KKR IPL 2026: ఐపీఎల్ లో తొలి మ్యాచ్లో 200కు మించి పరుగులు చేసినప్పటికీ.. కెప్టెన్ కిషన్ వీరోచితమైన హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ.. హైదరాబాద్ జట్టు గెలవలేకపోయింది. భారీ స్కోరును సైతం కాపాడుకోలేక.. బెంగళూరు చేతిలో తలవంచింది. తొలి మ్యాచ్ లోనే ఓటమి ఎదురయిన నేపథ్యంలో.. హైదరాబాద్ జట్టు ఆట తీరుపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు తొలి ఓటమిని మర్చిపోయి.. గురువారం కోల్ కతా తో జరిగే మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.
2024 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో హైదరాబాద్ ఓటమిపాలైంది. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్లో కూడా హైదరాబాద్ కోల్ కతా చేతిలో ఓడిపోయింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా కోల్ కతా చేతిలో భంగపాటుకు గురైంది. బలమైన బ్యాటింగ్ లైన్ అప్.. అదే స్థాయిలో బౌలింగ్ ఉన్నప్పటికీ ఆటగాళ్లు కీలక దశలో చేతులెత్తేయడంతో ఓటములు తప్పలేదు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు గురువారం నాటి మ్యాచ్లో కోల్ కతా ను ఎలా అడ్డుకుంటునేది ఆసక్తి కరం. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. లోకల్ ఆడియన్స్ సపోర్ట్ మొత్తం కోల్ కతా జట్టుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్ చాలా జాగ్రత్తగా ఈ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
అభిషేక్ శర్మ, హెడ్ స్థిరంగా ఆడాల్సిన అవసరం జట్టుకు ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే తొలి మ్యాచ్లో వీరిద్దరూ విఫలం కావడం.. జట్టు స్కోర్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే వంటి వారు విఫలం కావడం హైదరాబాద్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
బౌలింగ్లో కూడా హైదరాబాద్ జట్టు బౌలర్లు విఫలమయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్, డేవిడ్ పైన్, హర్ష్ దూబే, ఇషాన్ మాలింగ, హర్షల్ పటేల్ వంటి వారు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇందులో మలింగ దారుణంగా ఎక్స్ ట్రా లు వేయడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులకే తొలి వికెట్ తీసిన హైదరాబాద్ బౌలర్లు.. మరో వికెట్ తీయడానికి తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. రెండో వికెట్ కు ఏకంగా 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పే దాకా అలానే ఉండిపోయారు. అయితే అటువంటి బౌలింగ్ ప్రదర్శన మర్చిపోవాలని..కోల్ కతా తో సమర్థవంతంగా బౌలింగ్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ మీద అంత గొప్ప రికార్డు లేని హైదరాబాద్.. గురువారం నాటి మ్యాచ్లో ఆ అపప్రద కు ఫుల్ స్టాప్ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గురువారం నాటి మ్యాచ్లో హైదరాబాద్ జట్టులో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బౌలర్ల విషయంలో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లకు స్థాన చలనం తప్పకపోవచ్చు అని చెబుతున్నారు.
