https://oktelugu.com/

SRH vs GT : ఖాన్ తో గేమ్సా?

ఇక గుజరాత్ జట్టులో ఆడుతున్న రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహ, కేన్ విలియంసన్, విజయ్ శంకర్ వంటి వారు గతంలో హైదరాబాద్ జట్టుకు ఆడారు. వీరందరిని హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. దీంతో వారు గుజరాత్ జట్టు ఫ్రాంచైజీ లోకి వెళ్లారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2024 / 08:59 PM IST
    Follow us on

    SRH vs GT : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై గుజరాత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో తొలిసారి తక్కువ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ముద్దాడింది.

    కోల్ కతా, ముంబై జట్లతో జరిగిన మ్యాచ్ లలో క్లాసెన్ వీర విహారం చేశాడు. గుజరాత్ జట్టుతో మ్యాచ్ లోనూ క్లాసెన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ భావించారు.. కానీ అతడిని గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ఎక్కడికక్కడ కట్టడి చేశాడు. ముఖ్యంగా క్లాసెన్, రషీద్ ఖాన్ మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. రషీద్ ఖాన్ సంధించిన మూడు బంతులను క్లాసెన్ ధాటిగా ఎదుర్కొన్నాడు. మూడు బంతులకూ మూడు పరుగులు చేశాడు. కానీ నాలుగో బంతిని తక్కువ అంచనా వేసి క్రికెట్ సమర్పించుకున్నాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న క్లాసెన్ ను రషీద్ ఖాన్ వైవిధ్యమైన బంతితో బోల్తా కొట్టించాడు.. వికెట్ కోల్పోయిన బాధలో క్లాసెన్ విపరీతమైన కోపంతో మైదానాన్ని వీడాడు. పట్టరాని ఆగ్రహంతో బ్యాట్ ను తన చేతితో గట్టిగా కొట్టాడు.

    అప్పటికే హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు భారం మొత్తం క్లాసెన్ మీద పడింది.. దీంతో అతడు కూడా ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు ఓవర్ లోనే తన లయ అందుకున్నాడు. నూర్ అహ్మద్ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సులు కొట్టాడు.. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ లోనూ ఇదే తీరుగా ఆడతాడని అభిమానులు భావించారు. కానీ ఈ ఫైట్ లో రషీద్ ఖాన్ విజయం సాధించాడు. అద్భుతమైన బంతివేసి క్లాసెన్ ను బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ మాత్రమే కాదు ఫీల్డింగ్ లోనూ రషీద్ ఖాన్ మెరిశాడు. సూపర్ మాన్ లాగా డైవ్ చేస్తూ మార్క్రమ్ క్యాచ్ అందుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఆడిన అద్భుతమైన షాట్ ను కూడా ఊహించని రీతిలో క్యాచ్ పట్టి హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

    ఇక గుజరాత్ జట్టులో ఆడుతున్న రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహ, కేన్ విలియంసన్, విజయ్ శంకర్ వంటి వారు గతంలో హైదరాబాద్ జట్టుకు ఆడారు. వీరందరిని హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. దీంతో వారు గుజరాత్ జట్టు ఫ్రాంచైజీ లోకి వెళ్లారు. ప్రస్తుతం విలియంసన్ మినహా మిగతా వారంతా గుజరాత్ ప్లే 11 లో ఉన్నారు. దీంతో నె టిజన్లు గుజరాత్, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ను “సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఎక్స్ సన్ రైజర్స్ హైదరాబాద్” జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గా అభివర్ణించారు.