Sunrisers Hyderabad 2024
Sunrisers Hyderabad 2024: తెలుగు వాళ్ళు ఏం చేసినా.. విభిన్నంగా చేస్తారని..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిరూపించింది. కావ్య పాప ఆధ్వర్యంలో ఈ జట్టు IPL గత సీజన్లలో మెరుపులు మెరిపించకపోయినప్పటికీ.. జట్టుపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ జట్టు కోట్లు పోసి ఆస్ట్రేలియా ఆటగాళ్ళను కొనుగోలు చేసింది. శుక్రవారం ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ జట్టు యాజమాన్యం సరికొత్త పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
సన్ రైజర్స్ మేం బ్రో.. పక్కా ఓ రేంజ్ బ్రో.. అంటూ క్యాచీ పదాలతో ఈ పాట సాగింది. దీంతో జనాల్లోకి ఇట్టే వెళ్లిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి కూడా అదే కావాలి కాబట్టి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది తెగ సర్కులేట్ అవుతోంది. ఈ పాటకు హైదరాబాద్ ఆటగాళ్లు.. ఎరుపు, నారింజరంగు మిళితమైన డ్రెస్సులు వేసుకొని చిందులు వేశారు. ఈ పాటలో హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ కమిన్స్, హెన్రిచ్ క్లాసిన్, ట్రావిస్ హెడ్, మార్క్రమ్, భారత ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, జయదేవ్, వాషింగ్టన్ సుందర్ కనిపించారు. ఆటకు తగ్గట్టుగానే కొత్త జెర్సీలు వేసుకొని అలరించారు.
ఈ పాట హైదరాబాద్ జట్టు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా మిగతా జట్లు కూడా పాట లేదంటే థీమ్ మ్యూజిక్ తో దుమ్ము రేపుతున్నాయి. బెంగళూరు జట్టు ఇప్పటికే ఒక వీడియో విడుదల చేసింది. ఇక తొలి షెడ్యూల్లో హైదరాబాద్ జట్టు మార్చి 23న కోల్ కతా జట్టుతో..కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 27న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ముంబై జట్టుతో రెండవ మ్యాచ్, మార్చి 31న అహ్మదాబాద్ లో గుజరాత్ జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఏప్రిల్ 5న హైదరాబాదులో చెన్నై జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలను హైదరాబాద్ జట్టు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
,
Our new anthem is here to set your playlist on fire#SRHAnthem2024 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/U4xRxhYfGv
— SunRisers Hyderabad (@SunRisers) March 20, 2024