https://oktelugu.com/

Apple Company Issue: యాపిల్ కంపెనీ ఉత్పత్తులు సురక్షితం కాదా.. కేంద్రం ఏమని హెచ్చరిస్తోంది?

మనదేశంలో యాపిల్ కంపెనీ ఫోన్లు ఉపయోగించే ప్రముఖులకు " మీ ఫోన్ లో ఎవరో అనుచిత సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టారని" మెసేజ్ వచ్చింది. దీంతో అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 21, 2024 3:40 pm
    Apple Company Issue

    Apple Company Issue

    Follow us on

    Apple Company Issue: యాపిల్ కంపెనీ ఉత్పత్తులంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి ఏడాది యాపిల్ కంపెనీ సరికొత్త ఫోన్లను ఆవిష్కరిస్తూ ఉంటుంది. యాపిల్ ఫోన్ లను వాడడాన్ని చాలామంది సామాజిక హోదాకు చిహ్నంగా భావిస్తారు. యాపిల్ కంపెనీ ఉత్పత్తుల్లో ఫోన్లు మాత్రమే కాదు.. లాప్టాప్, ఐపాడ్ వంటి వాటిని ఎక్కువమంది వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ యాపిల్ కంపెనీ ఉత్పత్తులు అంత సురక్షితం కావా? యాపిల్ కంపెనీ చెప్పినంత సీన్ ఈ ఉత్పత్తులకు లేదా? హ్యాకర్లు ఈ ఫోన్లను లేదా ఇతర ఉత్పత్తులను త్వరగానే హ్యాక్ చేయగలుగుతారా? కేంద్రం తాజాగా చేసిన హెచ్చరికలు ఏమిటి? వీటిపై ప్రత్యేక కథనం.

    ఆ మధ్య మనదేశంలో యాపిల్ కంపెనీ ఫోన్లు ఉపయోగించే ప్రముఖులకు ” మీ ఫోన్ లో ఎవరో అనుచిత సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టారని” మెసేజ్ వచ్చింది. దీంతో అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. యాపిల్ కంపెనీ కూడా దీనిపై స్పందించింది. మా సమర్థవంతమైన సాఫ్ట్ వేర్ ను ఎవరూ హ్యాక్ చేయలేరంటూ ప్రకటించింది. కానీ తాజాగా కేంద్రం చేసిన హెచ్చరికల ప్రకారం యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కూడా హ్యాక్ కు గురవుతాయని తేలింది. Indian computer emergency response team (CERT- In) చేసిన హెచ్చరికల ప్రకారం iPhone, iPad, i Mac వంటి ఉత్పత్తుల్లో అనేక దుర్భలతలు ఉన్నాయని… ఫలితంగా ఇవి అనధికారిక యాక్సెస్ కు దారితీస్తాయని తేలింది. హ్యాకర్లు విజయవంతంగా ఆ ఉత్పత్తుల్లోకి ప్రవేశించి.. దోపిడీకి పాల్పడే అవకాశాలు కొట్టి పారేయలేమని ప్రకటించింది.

    ఈ మోడల్స్ ప్రభావితమయ్యాయి

    Apple vision OS 1.1 కంటే ముందు వెర్షన్లు..
    Apple reason Pro
    Apple TV OS 17.4 కి ముందు..
    Apple TV HD, Apple TV 4K అన్ని మోడల్స్.
    Apple watch OS 10.4 కంటే ముందు వెర్షన్..
    యాపిల్ వాచ్ సిరీస్ 4..
    Apple Mac OS Monterey 12.7.4 version, Apple Mac OS Sonoma 14.4‌ కి ముందు, యాపిల్ మాకోస్ వెంచురా వెర్షన్ 13.6.5 కంటే ముందు, Apple X code 15.3 version కంటే ముందు, Apple Mac OS Sonoma 14, ఇతర వెర్షన్ లు, Apple garage band 10.4.11కి ముందు వెర్షన్, యాపిల్ మాకోస్ వెంచురా, మాకోస్ సోనూమా..
    వంటివి హ్యాకర్స్ బారిన పడే రకాలని Indian computer emergency response team (CERT -In) ప్రకటించింది. యాపిల్ ఉత్పత్తుల్లో లోపాల వల్ల.. ఇతరులు దాడి చేసే అవకాశం ఉంది. హ్యాకర్లు ఏకపక్ష కోడ్ అమలు చేసే ప్రమాదం ఉంది. సున్నితమైన సమాచారం, భద్రతాపరమైన పరిమితులను దాటడానికి హ్యాకర్లు యాపిల్ ఫోన్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. CERT -In నివేదిక ప్రకారం వినియోగదారుడు తమ పరికరాలను హ్యాకర్ల బారి నుంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టం తాజా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేసి ఆ ఉత్పత్తులను వాడాలి.