SRH Vs KKR 2025 Records: ఈ డైలాగు ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఐపీఎల్ లో ఇతర జట్ల ఆటగాళ్లు పెద్ద పెద్ద ప్లేయర్లను కోట్లకు కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. వారేదో భారీగా పరుగులు చేసి తమ జట్టు పరువును కాపాడతారని కాదు.. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సెట్ చేసిన రికార్డులకు కనీసం దరిదాపుల్లోనైనా వస్తారని.. ఐపీఎల్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. జట్టు విభాగంలో గాని.. ప్లేయర్లకు భాగంలో గాని రికార్డులు సృష్టించిన ఘనత హైదరాబాద్ ఆటగాళ్లకే దక్కుతుంది. ఎందుకంటే ఐదుసార్లు చాంపియన్లు గా నిలిచిన చెన్నై, ముంబై జట్లలో గొప్ప గొప్ప ప్లేయర్ లు ఉన్నారు. వారిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే వారు చాలామంది ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ .. ఆ జట్ల పేరు ప్రస్తావనకు వస్తే 300 లోడెడ్ అనే పదం వినిపించదు. మచ్చుకు కూడా కనిపించదు.. కానీ హైదరాబాద్ జట్టు పేరు ప్రస్తావనకు వస్తే మాత్రం 300 లోడ్ అనే పదం పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీజన్లో హైదరాబాద్ జట్టు తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటుంది. తనకు తానే కొత్త కొత్త బెంచ్ మార్కులు సృష్టించుకున్నది.
ఈ సీజన్లో హైయెస్ట్ స్కోర్ హైదరాబాద్ చేసింది. సొంత మైదానంలో సంజు సేనకు (అప్పటి రాజస్థాన్ కెప్టెన్ ఇతడు) చుక్కలు చూపించింది. ఏకంగా 286 స్కోర్ చేసేసింది. 14 పరుగుల తేడాతో 300 స్కోర్ మిస్ చేసుకున్నప్పటికీ.. హైదరాబాద్ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అంతేకాదు సరికొత్త రికార్డులను సృష్టించుకున్నది..
గత ఏడాది డూ ప్లెసిస్ సేన పై హైదరాబాద్ మూడు వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది.. ఐపీఎల్ లో ఇదే హైయెస్ట్ రికార్డుగా కొనసాగుతోంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ పై ఈ సీజన్లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 286 రన్స్ చేసింది. ఒక రకంగా తన రికార్డుకు తానే దగ్గరగా వచ్చింది
ఈ సీజన్లో ఢిల్లీ వేదికగా రహానే సేన తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 278 రన్స్ స్కోర్ చేసింది.
ఇక గత సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుపై హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 277 రన్స్ స్కోర్ చేసింది.
ఒక రకంగా ఐపీఎల్ లో 270 ప్లస్ స్కోర్లు ఐదు సార్లు నమోదు కాగా.. అందులో నాలుగు సార్లు హైదరాబాద్ జట్టు నమోదు చేయడం విశేషం..
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా విశాఖపట్నం మైదానంలో 272 పరుగులు చేసింది.
గత సీజన్లో ఢిల్లీ వేదికగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 266 పరుగులు చేసింది.
ప్లేయర్ల పరంగా చూసుకుంటే..
గత సీజన్లో అభిషేక్ శర్మ ముంబై ఇండియన్స్ పై 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హెడ్ 16 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు.
2024 సీజన్లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హెడ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక ఈ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో క్లా సెన్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక ప్రస్తుత ఐపిఎల్ లో 400+ పరుగులు చేసి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్న ఆటగాళ్ల జాబితాలో.. హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేరాడు..
2019లో అండ్రి రసెల్ 510 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్రేట్ 204.8
2024లో అభిషేక్ శర్మ 484 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 204.2
ఈ సీజన్ లో నికోలస్ పూరన్ 511 పరుగులు చేశాడు. ఇతని స్ట్రైక్ రేట్ 198.8.
అభిషేక్ శర్మ ఇప్పటివరకు 439 పరుగులు చేశాడు. ఇతడు స్ట్రైక్ రేట్ 193.4
హెడ్ గత సీజన్లో 567 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 191.5