Homeక్రీడలుKavya Maran: హైదరాబాద్ గెలిచింది.. కావ్య పాప నవ్వింది.. మీమ్స్, ట్రోల్స్ వైరల్

Kavya Maran: హైదరాబాద్ గెలిచింది.. కావ్య పాప నవ్వింది.. మీమ్స్, ట్రోల్స్ వైరల్

Kavya Maran: క్రికెట్ అనేది నిన్నా మొన్నటి వరకు పురుషులకే సొంతమని భావించేవారు. అందులో ఇప్పుడు ఆడవాళ్లు కూడా రాణిస్తున్నారు. అంతేకాదు వ్యాపారులుగానూ సత్తా చాటుతున్నారు. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా.. హైదరాబాద్ యజమానిగా కావ్య సత్తా చాటుతోంది..సన్ టీవీ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తెగా కావ్య అందరికీ పరిచయమే. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ముంబై పై గెలవడంతో కావ్య గంతులు వేస్తోంది. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని మైదానంలో చిన్న పిల్లలా సందడి చేసింది. ఆటగాళ్లను ఉత్సాహపరిచింది.

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు పై హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించింది. క్లాసెన్ 80 నాట్ అవుట్, అభిషేక్ 63, హెడ్ 62.. తిరుగులేని ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ రికార్డ్ స్థాయిలో 277 రన్స్ చేసింది. 278 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కూడా ధాటిగా ఆడింది. రోహిత్ శర్మ, కిషన్, తిలక్ వర్మ సిక్సర్ల వర్షం కురిపించారు. ఒకానొక దశలో ముంబై గెలుస్తుందని అందరూ భావించారు. ఆ సమయంలో హైదరాబాద్ జట్టు యజమాని కావ్య టెన్షన్ పడింది. రోహిత్ శర్మ 26 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఎగిరి గంతేసింది.

అంతకుముందు హైదరాబాద్ ఆటగాళ్లు బౌండరీలు, సిక్స్ లు కొడుతుంటే స్టేడియంలో సందడి చేసింది. క్లాసెన్ బ్యాటింగ్ చేస్తుంటే ఎగిరి గంతేసింది. ఆ సమయంలో కెమెరాలు మొత్తం కావ్య వైపే మళ్ళాయి. హైదరాబాద్ ఆటగాళ్లు సిక్స్ లు కొట్టినప్పుడల్లా కెమెరాలు ఆమెను చూపించాయి. కావ్య మైదానంలో సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి కావ్య సంతోషంగా కనిపించారు. హైదరాబాద్ ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి చూసి ఎగిరి గంతులు వేసింది.

ముఖ్యంగా హెడ్ దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ జట్టుకు బలమైన పునాది ఏర్పడింది. దీంతో ఈ ప్రపంచంలో ఈ స్థాయి ఆనందం ఇంకోటి లేదన్నట్టుగా కావ్య భావోద్వేగానికి లోనైంది. ముఖ్యంగా క్లాసెన్ సిక్స్ లు కొట్టినప్పుడల్లా కావ్య ఆనందం అవధులు దాటింది. క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు చేయడంతో.. కావ్య కేరింతలు కొట్టింది.. కావ్య మైదానంలో సందడి చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..”ఆమె ఆనందానికి అవధులు లేవు. హైదరాబాద్ జట్టు యజమాని గా సంతోషాన్ని ఆస్వాదిస్తోంది. ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆమె కావచ్చు. జట్టు విజయం సాధించినప్పుడల్లా కావ్య మోము మతాబు లాగా వెలిగిపోతుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version