Sanju Samson : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్రికెట్ లీగ్. ఇందులో ఆడే అవకాశం ఒక్కసారి లభిస్తే చాలు ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అందుకే ఈ క్రికెట్ లీగ్ లో ఆడాలని.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చాలామంది ఆటగాళ్లు అనుకుంటారు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుండడంతో.. ఐపీఎల్ లో అవకాశం దక్కించుకోవాలని తహతహలాడుతుంటారు. ఈ జాబితాలో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఒకడు. ప్రస్తుతం అతని ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెర్త్ ఎప్పుడో ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో అప్రతిహత విజయాలు సాధిస్తూ, టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే రాజస్థాన్ జట్టులోకి సంజుకు అంత ఈజీగా ఎంట్రీ లభించలేదు.. దీనికోసం అతడు చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి కట్టు కథలు కూడా చెప్పాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని ప్రకటించాడు. “2009లో కోల్ కతా జట్టుకు నేను ఎంపికయ్యాను. ప్లే ఎలెవన్ లో నాకు చోటు లభించడం చాలా కష్టం అయ్యేది. అయితే, నన్ను ఒకసారి రాజస్థాన్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు శ్రీశాంత్ ఓ హోటల్ లాబీల పరిచయం చేశాడు. స్థానికంగా జరిగిన ఒక టోర్నమెంట్లో ఆరు బాళ్ళకు ఆరు సిక్సర్లు కొట్టానని నా గురించి రాహుల్ ద్రావిడ్ తో అబద్ధం చెప్పాడు. దానిని నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. పైగా నన్ను కచ్చితంగా మీ జట్టులోకి తీసుకోవాలని శ్రీశాంత్ ద్రావిడ్ ను కోరాడు. దానికి రాహుల్ ద్రావిడ్ సమ్మతం తెలిపాడు. తర్వాత నన్ను రాహుల్ ద్రావిడ్ పరీక్షించాడు. అయితే నేను అంత బాగా ఆడలేదు. అయినప్పటికీ శ్రీశాంత్ రాహుల్ ద్రావిడ్ ను ఒప్పించాడు. అలా నేను రాజస్థాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాను. తొలి నాళ్లల్లో రాజస్థాన్ జట్టు ఆశించినంత స్థాయిలో విజయాలు సాధించలేదు. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరంలో కప్ గెలుచుకున్న రాజస్థాన్ జట్టు.. మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదని” సంజు పేర్కొన్నాడు.
రాహుల్ ద్రావిడ్ ఓకే చెప్పడంతో 2013లో సంజు రాజస్థాన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనైతే ఇచ్చాడు గాని.. ఆ జట్టులో అతడి ప్రయాణం నల్లేరు మీద నడక మాత్రం కాలేదు. 2016 వరకు ఆ జట్టులో ఆడాడు. కొన్నిసార్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం కూడా వచ్చేది కాదు. అనంతరం సంజు 2016లో ఢిల్లీ జట్టుకు ఆడాడు. 2021లో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వెళ్లే ముందు.. 2019 సీజన్లో 342, 2020లో 375 రన్స్ చేసి తిరుగులేని రికార్డును తన పేరు మీద సృష్టించుకున్నాడు. 2021లో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అతడి ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు ఒక మోస్తారు ప్రదర్శన చేసింది. ప్రస్తుత సీజన్ లో అదరగొడుతోంది. పది మ్యాచ్లు ఆడి.. 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెస్ట్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో.. సంజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Was in KKR but couldn't get games, Sreeshanth was in RR & when we had a game with RR where Dravid was their skipper, Sreeshanth stopped Dravid in the hotel & told him, this kid is from kerala, he has hit 6 sixes in an over in a local tourney, we should give him a trial & sanju is… pic.twitter.com/PaxWLb1C90
— arfan (@Im__Arfan) May 5, 2024