https://oktelugu.com/

Netflix: నెట్ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ లో ట్రెండ్ అవుతున్న మూవీస్, సిరీస్లు ఇవే… మిస్ కాకండి!

ఇంటర్నేషనల్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో నెట్ఫ్లిక్స్ కలిగి ఉంది. దాంతో ఇండియన్ ఆడియన్స్ అట్రాక్ట్ కాలేకపోతున్నారు. అయినప్పటికీ అద్భుతమైన చిత్రాలు సిరీస్లు ప్రేక్షకులకు ముందుకు తెస్తూ...

Written By:
  • S Reddy
  • , Updated On : May 6, 2024 / 02:18 PM IST

    top trending movies and series on Netflix this week

    Follow us on

    Netflix: వరల్డ్ ఓటీటీ దిగ్గజాల్లో నెట్ఫ్లిక్స్ ఒకటి. భారతదేశంలో మార్కెట్ విస్తరించే పనిలో ఉంది. అయితే హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా నుండి నెట్ఫ్లిక్స్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ క్రమంలో స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు సూపర్ హిట్ సినిమాలకు తన చందాదారులకు అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. దాదాపు 5 కోట్ల మంది చందాదారులతో హాట్ స్టార్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చార్జెస్ అధికంగా ఉండటం కూడా ఇందుకు కారణం.

    ఇంటర్నేషనల్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో నెట్ఫ్లిక్స్ కలిగి ఉంది. దాంతో ఇండియన్ ఆడియన్స్ అట్రాక్ట్ కాలేకపోతున్నారు. అయినప్పటికీ అద్భుతమైన చిత్రాలు సిరీస్లు ప్రేక్షకులకు ముందుకు తెస్తూ ఆదరణ పెంచుకునే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. ఇక ఈవారం నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఏమిటో చూద్దాం. హిందీ చిత్రం లాప్తా లేడీస్ గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైంది. అమీర్ ఖాన్, కిరణ్ రావ్ నిర్మించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో టాప్ వన్ లో ట్రెండ్ అవుతుంది.

    సిద్ధూ జొన్నలగడ్డ బ్లాక్ బస్టర్ నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26 నుండి స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓటీటీలో కూడా ఆదరణ దక్కించుకుంటుంది. టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. వీటిలో పాటు ఈ చిత్రాలు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి.

    నెట్ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్
    1. లాప్తా లేడీస్
    2. టిల్లు స్క్వేర్
    3. ఆర్టికల్ 370
    4. డియర్
    5. అమర్ సింగ్ చమ్కీలా
    6. దంగే
    7. ఎనీ వన్ బట్ యు
    8. ఆల్ ఇండియా ర్యాంక్
    9. ఫైటర్
    10 సిటీ హంటర్

    టాప్ 10 సిరీస్లు
    1. హీరామండి
    2. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో
    3. డెడ్ బాయ్ డిటెక్టివ్స్
    4. బేబీ రీ ఇండీర్
    5. క్వీన్ ఆఫ్ టియర్స్
    6. మామ్లా లీగల్ హైన్
    7. ది అసుంటా కేస్
    8. మాంక్
    9. ది లాస్ట్ ఎయిర్ బెండర్
    10. పారసైట్ ది గ్రే