Ravichandran Ashwin Retirement: ఇండియన్ టీం లో దిగ్గజస్పిన్నర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్… ఒకప్పుడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లాంటి దిగ్గజ స్పిన్నర్లు ఇండియన్ టీం కి చాలా విజయాలను కట్టబెట్టారు. ఇక వాళ్ళ తర్వాత వాళ్ళ లెగసీని ముందుకు తీసుకెళ్లిన ఒకే ఒక స్పిన్నర్ చంద్రన్ అశ్విన్ ఈయన వల్ల చాలా మ్యాచుల్లో ఇండియన్ టీమ్ విజయం సాధించడమే కాకుండా చాలా అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మరి ఈయన ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఒక అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చాడు. ఇక దీనిని బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది…
#Ashwin has announced his retirement from all forms of international cricket!
With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! pic.twitter.com/alfjOj4IDm
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
మరికొన్ని సంవత్సరాలపాటు ఇండియన్ టీమ్ కి తన సేవలను అందిస్తాడు అనుకున్న రవిచంద్రన్ అశ్విన్ ఇలా సడన్ గా అందరికీ షాక్ ఇస్తూ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుందనే చెప్పాలి… ఇక ఇపుడున్న పరిస్థితిలో ఆయన లాంటి స్పిన్నర్ ఇండియన్ టీమ్ లో మరెవరు కనిపించడం లేదు. కాబట్టి ఆయన రిటైర్ మెంట్ ప్రకటించడం పట్ల యావత్ ఇండియన్ క్రికెట్ అభిమానులందరూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన కూడా తనకు ఏజ్ అయిపోయిందనే ఉద్దేశ్యం తోనే కొత్త వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలని అనుకొని రిటర్మెంట్ ప్రకటించానట్టుగా తెలుస్తోంది…
ఇక ఇండియన్ క్రికెట్ టీం మొత్తం అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతుంది. ఇక ఏది ఏమైనా కూడా అశ్విన్ లాంటి దిగ్గజ స్పిన్నర్ ఇండియన్ టీమ్ కి మరొకరు దొరకడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనే.. ఇక ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా తో మూడో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ కి ముందుగానే తన రిటర్మెంట్ ప్రకటిస్తున్న విషయాన్ని చెప్పిన అశ్విన్ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…
Emotional moments from the Indian dressing room #AUSvINDOnStar #BorderGavaskarTrophy #Ashwin #ViratKohli pic.twitter.com/92a4NqNsyP
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
ఇక ఇప్పటివరకు ఈయన మూడు ఫార్మాట్లలో కలిపి ఎన్ని పరుగులు చేశాడు…ఎన్ని వికెట్లను పడగొట్టాడు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇక ఆయన బ్యాటింగ్ రికార్డ్ ను కనక చూసుకున్నటైతే…
2011 వ సంవత్సరంలో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పటివరకు 106 మ్యాచ్ లను ఆడగా అందులో 151 ఇన్నింగ్స్ లకు కాను 3503 పరుగులను చేశాడు…124 హయ్యెస్ట్ స్కోర్ గా నమోదైంది…అలాగే 25.8 అవరేజ్, 54.5 స్ట్రైక్ రేట్ తో ముందుకు సాగాడు..ఇక ఇందులో 6 సెంచరీలు ఉండగా, 14 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి…399 ఫోర్లు,23 సిక్స్ లు ఉండటం విశేషం…
ఇక ఇదిలా ఉంటే వన్డేల్లో ఆయన బ్యాటింగ్ రికార్డ్స్ ను కనక చూసుకున్నటైతే
2010 లో వన్డే ల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ 116 వన్డే మ్యాచ్ లను ఆడాడు… అందులో 63 ఇన్నింగ్స్ లకు కాను 707 పరుగులు చేశాడు…అందులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 65 గా నమోదైంది…ఇక 16.4 అవరేజ్ తో 87.0 స్ట్రైక్ రేట్ తో ముందుకు సాగాడు…ఇక ఇప్పటి వరకు వన్డేల్లో 1 హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు…ఆయన ఎంటైర్ వన్డే కెరియర్ లో 60 ఫోర్లు,7 సిక్స్ లు ఉండటం విశేషం…
ఇక టీ 20 విషయానికి వొస్తే 65 మ్యాచ్ లను ఆడిన ఆయన 19 ఇన్నింగ్స్ లకు కాను 184 పరుగులు చేశాడు. అందులో 31 పరుగులు ఆయన చేసిన హైయెస్ట్ పరుగులు కాగా, 26.3 అవరేజ్ తో 115.0 స్ట్రైక్ రేట్ తో ముందుకు సాగాడు…ఇక ఆయన ఎంటైర్ టీ 20 కెరియర్ లో 17 ఫోర్లు, 4 సిక్స్ లు ఉండటం విశేషం…
ఇక 2009 లో ఆయన ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో 212 మ్యాచ్ ల్లో 94 ఇన్నింగ్స్ లకు కాను 800 పరుగులు చేశాడు…అందులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 50 కాగా 13.3 అవరేజ్ తో 118.5 స్ట్రైక్ రేట్ తో ముందుకు సాగాడు…ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండటం విశేషం…ఇక అలాగే 61 ఫోర్లు, 28 సిక్స్ లు నమోదు చేశాడు…
ఇక బౌలింగ్ లో ఆయన సాధించిన రికార్డ్స్ ని కనక మనం చూసుకున్నట్లయితే
మొదట టెస్టుల్లో కనక చూసుకుంటే
106 మ్యాచ్ లను ఆడిన ఆయన 537 వికెట్లను తీశాడు…2.83 ఎకానమీ తో ముందుకు సాగుతున్నాడు. ఇక 7/58 గా తన బెస్ట్ ను నమోదు చేసుకున్నాడు…ఒక మ్యాచ్ లో ఇప్పటి వరకు 37 సార్లు 5 వికెట్లు తీశాడు…అలాగే ఒక మ్యాచ్ లో 8 సార్లు 10 వికెట్లు తీసిన ఘనతను కూడా సంపాదించుకున్నాడు….
ఇక వన్డే లా విషయానికి వస్తే 166 మ్యాచ్ లను ఆడిన ఆయన 156 వికెట్లను తీశాడు…33.21 అవరేజ్ తో 4.93 ఏకనామితో ముందుకు సాగాడు…ఇక తమ ఎంటైర్ వన్డే కెరియర్ లో ఒక మ్యాచ్ లో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు అదే తన బెస్ట్ గా మార్చుకున్నాడు…
ఇక టి 20 మ్యాచ్ ల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆయన 65 మ్యాచ్ లను ఆడాడు…అందులో 72 వికెట్లు తీశాడు…అందులో 23.22 అవరేజ్ తో 6.91 ఏకనామి తో ముందుకు సాగాడు…ఇక ఒక మ్యాచ్ లో 8 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి దానిని అతన బెస్ట్ గా మార్చుకున్నాడు….