CPL 2024 : కరేబియన్ దీవులలో ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ -2024 టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ పెనో విధ్వంసం సృష్టించాడు. బార్బోడోస్ రాయల్స్ జట్టుకు అతడు ఆడుతున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు శివాలుగాడు. మైదానంలో బ్యాట్ తో పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఎనిమిది ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. 68 బంతుల్లోనే 115 రన్స్ చేశాడు. తద్వారా కరేబియన్ లీగ్ లో తొలి శతకం సాధించాడు. డికాక్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల బార్బడోస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 205 రన్స్ చేసింది.. డికాక్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు. ప్రారంభంలో నిదానంగా ఆడాడు. మరో ఓపెనర్ కదీమ్ 9 బాల్స్ లో 22 రన్స్ కొట్టాడు. అతడు అవుట్ అయిన తర్వాత జట్టు భారాన్ని డికాక్ భుజాన వేసుకున్నాడు. సహచర ఆటగాళ్లు మొత్తం అవుట్ అవుతున్నప్పటికీ డికాక్ మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించాడు. బౌండరీలు కొట్టాడు. సిక్సర్లు బాదాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు.. చివర్లో హోల్డర్ పది బంతుల్లో 28* పరుగులు చేసి అదరగొట్టాడు.. గయానా బౌలర్లలో రిఫర్ మూడు వికెట్లు సాధించాడు. ప్రిటోరియస్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ లక్ష్యాన్ని చేదించేందుకు గయానా అమెజాన్ వారియర్స్ రంగంలోకి దిగి.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 173 రన్స్ చేసింది. ఫలితంగా బార్బోడోస్ రాయల్స్ 32 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
హోప్ టాప్ స్కోరర్..
గయానా అమెజాన్ వారియర్స్ జట్టులో కెప్టెన్ హోప్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొయిన్ అలీ 33, పాల్ 30, హిట్ మెయిర్ 28 పరుగులు చేశారు. బార్బోడోస్ బౌలర్లలో కేశవ్ మహారాజు మూడు వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ రెడ్ వికెట్లు సాధించాడు. లక్ష్యాన్ని చేదించే క్రమంలో గయానా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన హెట్ మెయిర్ , హోప్ బాధ్యతాయుతంగా ఆడారు. జట్టు భారాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. ఇదే సమయంలో బార్బడోస్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడంతో గయానా జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. ప్రేక్షకులకు తగ్గట్టుగానే ఆటగాళ్లు తమ ఆట తీరును ప్రదర్శించారు. ఫలితంగా ప్రేక్షకులు టి20 క్రికెట్ లోని అసలైన మజాను ఆనందించారు. ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. దీంతో మైదానం మొత్తం సందడిగా మారింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ కు సిసలైన అర్థం చెప్పింది.
&
What a magical moment for Quinton de Kock.
Congratulations on your century!!! #CPL24 #BRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #Sky365 pic.twitter.com/yY2Ez2TZkD
— CPL T20 (@CPL) September 15, 2024