https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అధికారికంగా వచ్చిన ఓటింగ్ ఇదే..శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనుక భారీ కుట్ర!

నిన్న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో శేఖర్ బాషా, ఆదిత్య ఓం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటింగ్ లో బాటమ్ టాప్ 2 లో ఉన్నది వీళ్లిద్దరు మాత్రమే. వీరిలో ఎవరికీ తక్కువ ఓట్లు ఉంటాయో, వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, అదే గత సీజన్స్ అన్నిట్లో జరిగింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ట్విస్టుల పేరుతో బిగ్ బాస్ యాజమాన్యం జనాలను మోసం చేసినట్టుగా అనిపించింది. ఓటింగ్ ప్రకారం శేఖర్ బాషా కంటే ఆదిత్య ఓం కి తక్కువ ఓట్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 08:32 AM IST

    Bigg Boss Telugu 8(14)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఎక్కడైనా న్యాయం గెలవాలనే ప్రతీ ఒక్కరు కోరుకుంటారు, అన్యాయంగా ఉన్న వాటిని అసలు క్షమించరు. అన్యాయంగా వ్యవహరించిన ఎంతో మంది మహామహులను జనాలు మట్టికరిపించిన రోజులు చాలా ఉన్నాయి. అందుకు ఉదహారణలు కోకోల్లలు. రాజకీయంగా కానీ, సినిమాల పరంగా కానీ అన్యాయంగా వ్యవహరించిన ఏ ఒక్కరూ కూడా బాగుపడలేదు. టీవీ షోస్ లలో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పిలవబడే బిగ్ బాస్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రతివారం ఇలాంటివి జరగడం వల్లే ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ అలాంటి సంఘటనలు చోటు చేసుకోవు, ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్స్ విషయం లో జాగ్రత్తగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఈ సీజన్ మొత్తం తప్పు దారిలోనే వెళ్తుంది. నేడు శేఖర్ బాషా ఎలిమినేషన్ అందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు ఈ సీజన్ లో గడిచిన రెండు వారాల్లోనే ఎన్నో కనిపించాయి.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో శేఖర్ బాషా, ఆదిత్య ఓం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటింగ్ లో బాటమ్ టాప్ 2 లో ఉన్నది వీళ్లిద్దరు మాత్రమే. వీరిలో ఎవరికీ తక్కువ ఓట్లు ఉంటాయో, వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, అదే గత సీజన్స్ అన్నిట్లో జరిగింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ట్విస్టుల పేరుతో బిగ్ బాస్ యాజమాన్యం జనాలను మోసం చేసినట్టుగా అనిపించింది. ఓటింగ్ ప్రకారం శేఖర్ బాషా కంటే ఆదిత్య ఓం కి తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ బిగ్ బాస్ టీం కి ఎందుకో శేఖర్ బాషా నచ్చినట్టు లేదు. గత వారం మొత్తం ఆయనకీ టాస్కులు రానివ్వకుండా చేసారు, ఆయన కంటెంట్ ని అసలు టీవీలలో చూపించలేదు, ఫలితంగా జనాలతో కనెక్షన్ పోయి ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ జనాలు ఆయనకీ ఆదిత్య ఓం కంటే ఎక్కువ ఓట్లే వేశారు. కానీ బిగ్ బాస్ వేరేది ప్లాన్ చేసాడు. కంటెస్టెంట్స్ నుండి ఎన్నుకోబడిన వారు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం గతంలో సీజన్ 2 లో జరిగింది.

    మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి సంఘటన జరిగింది. వీళ్లకు ఇష్టమొచ్చినట్టు వీళ్ళు ఎలిమినేషన్ చేసునేందుకు ఆడియన్స్ చేత ఓట్లు వేయించడం ఎందుకు, ప్రతీ వారం మీకు నచ్చిన కంటెస్టెంట్ ని ఉంచుకొని నచ్చని కంటెస్టెంట్ ని బయటకు పంపేయండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. శేఖర్ భాషల్లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చాలా ఆట దాగుంది, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తన గురించి తానూ పోరాడడంలో శేఖర్ బాషా చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఇలా టాప్ 5 వరకు రాగల సత్తా ఉన్న శేఖర్ బాషా లాంటి కంటెస్టెంట్ వచ్చే వారం కూడా ఎలిమినేట్ అయితే ఇక ఈ షో చూడడం జనాలు మానేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.