https://oktelugu.com/

David Miller: సౌతాఫ్రికా ఓటమికి తనదే బాధ్యత.. రిటైర్‌మెంట్ ప్రకటించి షాకిచ్చిన సౌతాఫ్రికా దిగ్గజం

డేవిడ్ మిల్లర్ తన ఇన్ స్టాలో స్టోరీని పంచుకున్నాడు. ఇదేదో ఒటమికి బాధ్యత వహిస్తూ తాను అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని మిల్లర్ చెప్పాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 3, 2024 2:34 pm
    David Miller

    David Miller

    Follow us on

    David Miller: ఈ సారి టీ20 వరల్డ్ కప్ షాకింగ్ విషయాలను మోసుకొచ్చింది. వరల్డ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఆఫ్గనిస్తాన్ ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ చారిత్రాత్మక క్యాచ్ మ్యాచ్ ను విజయానికి చేరువ చేయడం. ఇంకా వరల్డ్ క్లాస్ బ్యాటర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం.

    అయితే ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ తొలి బంతిని బౌండరీ వైపు తరలించాడు డేవిడ్ మిల్లర్. కానీ అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆ బాల్ ను ఒడిసి పట్టుకొని మిల్లర్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో సౌతాఫ్రికాకు కప్పు దూరమైంది. ఈ క్యాచ్ తో మిల్లర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మిల్లర్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

    ‘బెస్ట్ గేమ్ ఇంకా రావాల్సి ఉంది’
    డేవిడ్ మిల్లర్ తన ఇన్ స్టాలో స్టోరీని పంచుకున్నాడు. ఇదేదో ఒటమికి బాధ్యత వహిస్తూ తాను అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని మిల్లర్ చెప్పాడు. అవన్నీ కేవలం పుకార్లే మిల్లర్ తన ఆట తీరును మెరుగు పరుచుకొని మరీ మైదానంలోకి అడుగు పెడతాడని ఆయన ప్రకటించారు.

    ‘నేను అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. నేను నా ప్రొటీన్ (సౌతాఫ్రికా జట్టు)కు అందుబాటులో ఉంటా’ అని దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఇన్ స్టా స్టోరీ చివరి లైన్ లో రాశాడు, ‘ఉత్తమం (ఉత్తమ ఆట) ఇంకా రావాల్సి ఉంది.’

    ముగ్గురు భారత స్టార్ బ్యాట్స్ మన్ల రిటైర్మెంట్
    జూన్ 29న బార్బడోస్ వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత మొదట కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ మరుసటి రోజే రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

    మిల్లర్ స్ట్రాంగ్ క్యాచ్ అందుకున్న సూర్య..
    ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తరఫున డేవిడ్ మిల్లర్ ఫై డౌన్ లో వచ్చి 17 బంతుల్లో 21 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్ లో ఆఫ్రికా జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యాను ఎదుర్కొనేందుకు మిల్లర్ రంగంలోకి దిగాడు.

    తొలి బంతికే మిల్లర్ ఏరియల్ షాట్ కొట్టగా.. దాన్ని సూర్యకుమార్ యాదవ్ బాగా క్యాచ్ చేశాడు. సూర్య పరుగెత్తే సమయంలో బౌండరీపై క్యాచ్ తీసుకొని బంతిని మైదానం లోపల గాల్లోకి విసిరి బౌండరీ దాటి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చి దాన్ని పట్టుకున్నారు. ఈ క్యాచ్ ఇప్పటి వరకు పతాక శీర్షికల్లో నిలిచింది.