Pakistan Cricket Team : మొన్న బంగ్లా పై పురుషులు.. నేడు సౌత్ ఆఫ్రికాపై మహిళలు.. పాక్ జట్టు గ్రహచారం ఎందుకు ఇలా తగలబడింది..

సరిగ్గా 20 రోజుల క్రితం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. మరీ దారుణంగా సొంత దేశంలో తొలి టెస్టును బంగ్లా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.. ఇక రెండో టెస్టు 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ పురుషుల జట్టుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పురుషుల దరిద్రమే ఇలా ఉందంటే.. మహిళల జట్టుది కూడా అలానే తగలబడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 20, 2024 4:00 pm

Pakistan Cricket Team

Follow us on

Pakistan Cricket Team :  పాకిస్తాన్ వేదికగా సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు మూడు టీ -20 ల సిరీస్ ఆడింది. 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో టి20 లో సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ దక్కించుకుంది.. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి 153 పరుగులు చేసింది. సిద్రా అమీన్(37) వికెట్ కీపర్ మునీబా అలీ(33) టాప్ స్కోరర్ లు నిలిచారు. ఫాతిమాసనా(27), గుల్ ఫిరోజా(18) ధాటిగా ఆడే క్రమంలో వెంట వెంటనే ఔటయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్, తుమీ సెఖుసెఖునే నోస్కులు లేకో ఎంలాబా, సునే లూస్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో 12 పరుగులు సమర్పించుకోవడం విశేషం. మునీబా అలీ, ఫిరోజా తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలొల్పారు. మునీబా అలీ ఉన్నంతలో మెరుపులు మెరిపించింది. 26 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేసింది. దురదృష్టవశాత్తు తజ్మీన్ బ్రిట్స్ చేతిలో రనౌట్ అయింది.

ధాటిగా దక్షిణాఫ్రికా

154 పరుగుల విజయ లక్ష్యం తో బర్లోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు మూడు పరుగుల వద్ద తజ్మిన్ బ్రిట్స్(0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ జోరును పాకిస్తాన్ బౌలర్లు కొనసాగించలేకపోయారు..లారా వోల్వర్ట్(45), అన్నె కె బోష్(46), అన్నెరీ డెర్కెసెన్ (44) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని సాధించింది. 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి.. దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. పాకిస్తాన్ బౌలర్లలో తుబా హాసన్, సాదియా ఇక్బాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్షిణాఫ్రికా క్రీడాకారిణి సునే లూస్ దక్కించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అన్నెరీ డెర్కెసెన్ సొంతం చేసుకుంది. కాగా, తొలి టి20 మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా , పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండవ టి20 లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి, 168 రన్స్ మాత్రమే చేసి.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.