https://oktelugu.com/

David Warner: పుష్ప 2 కోసం సుకుమార్ వేసిన ప్లానింగ్ మామూలుగా లేదుగా…ఏకంగా స్టార్ క్రికెటర్ నే రంగం లోకి దింపుతున్నాడా..?

తమదైన రీతిలో సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం తమను తాము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 20, 2024 / 03:59 PM IST

    David Warner

    Follow us on

    David Warner: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప ‘ సినిమాతో ఐకాన్ స్టార్ గా కూడా మారిపోయాడు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం ‘పుష్ప 2’ తో మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధించాలనే ఉద్దేశ్యంతోనే ముందుకు అడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాకి తెలుగులో అంత ఆదరణ దక్కకపోయిన కూడా బాలీవుడ్ లో మాత్రం మంచి ఆదరణ అయితే దక్కింది. ఇక దాంతోపాటుగా ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి పాన్ ఇండియాలో అల్లు అర్జున్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే పుష్ప 2 సినిమా మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పుష్ప 2 సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచడానికి ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ ను సైతం భాగం చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    అతను ఎవరు అంటే ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక క్యామియో రోల్ నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వార్నర్ కి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.

    అందువల్లే ఆయన తెలుగు సినిమాలో వచ్చిన ఫేమస్ సాంగ్స్ ను డైలాగ్స్ ను రీల్స్ రూపంలో చేస్తూ ప్రేక్షకులను ఎన్టీయార్ టైన్ చేస్తూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ చేసిన అలా వైకుంఠపురం, పుష్ప లాంటి సినిమాల్లోని కొన్ని డైలాగ్స్ ని కూడా రీల్స్ రూపంలో చేసి ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. అందుకే అతన్ని ఈ సినిమాలో భాగం చేయాలని సుకుమార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి మొత్తానికైతే ఆయనతో ఒక చిన్న క్యామియో రోల్ చేసి మెప్పించి అందరిని సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఆయన కనక సినిమాలో ఉంటే ఇండియా వైడ్ గానే కాకుండా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. అందువల్లే అతన్ని ఈ సినిమాలో భాగం చేయాలని అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…