https://oktelugu.com/

ind vs sa 1st t20 : సంజు జోరు మాత్రమే కాదు.. వారి ప్రతిభ కూడా తోడైంది.. అదే సఫారీలను మట్టికరిపించింది..

నాలుగో టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం రాత్రి డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.. సంజు శాంసన్ సూపర్ సెంచరీ భారత జట్టుకు బాటలు వేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2024 / 09:59 AM IST
    Follow us on

    ind vs sa 1st t20 : పొట్టి ఫార్మాట్ లో సంజు మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు.. దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరు కొనసాగించాడు. 50 పంతులు ఎదుర్కొన్న అతడు ఏడు ఫోర్లు, ప్రతి సిక్సర్ల సహాయంతో 107 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా మైదానాలు బౌన్సీగా ఉన్నప్పటికీ.. అతడు ప్రారంభం నుంచి ఎదురుదాడికి దిగడం విశేషం. సంజు బ్యాటింగ్ తో అలరిస్తే.. స్పిన్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి 3/25, రవి బిష్ణోయ్ 3/28 అదరగొట్టారు. మెలికలు తిరిగే బంతులు వేస్తూ దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఎక్కడికక్కడ నిలుపుదల చేశారు. దీంతో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 61 పరుగుల పేర్లతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సిరీస్లో రెండవ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

    ముందుగా బ్యాటింగ్ చేసి..

    టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది.. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. తిలక్ వర్మ 33, సూర్య కుమార్ యాదవ్ 21 పర్వాలేదనిపించారు.. దక్షిణాఫ్రికా బౌలర్ కొయేట్జి కి మూడు వికెట్ల లభించాయి. ఆ తర్వాత 203 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం గెలుపు దిశగా ప్రయాణం సాగించలేదు. 17.5 పవర్లలో కేవలం 141 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. క్లాసెన్(25), కొయేట్జి(23), రికెల్టన్(21) మాత్రమే పరవాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సంజు ఎంపికయ్యాడు.

    అదిరిపోయే ఆరంభం

    ఈ మ్యాచ్లో సంజు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎలాంటి బౌలర్ అయినా సరే ఎదురు దాడికి దిగాడు. భారీ షాట్లతో సత్తా చాటాడు. కింగ్స్ మీడ్ మైదానంలో సునామీ సృష్టించాడు. అతడు ఉన్నంతసేపు టీమిండియా స్కోర్ వరద ప్రవాహం లాగా హోరెత్తింది. అతడు ఔట్ అయిన తర్వాత నెమ్మదించింది. అయితే చివరి ఆరు ఓవర్లను దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా వేశారు. క్రికెట్ కూడా అదే స్థాయిలో పడగొట్టారు. అందువల్లే ఆశించిన స్థాయిలో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (7) దారుణంగా విఫలమైనప్పటికీ.. సంజు తన దూకుడు తగ్గించలేదు.. సూర్య కుమార్ యాదవ్ ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు. అతడు ఔటైన తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. అతడు కూడా ధాటిగా ఆడాడు. మొత్తంగా 47 బంతుల్లోనే సంజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సంజు అవుట్ అయిన తర్వాత హార్దిక్ (2), రింకూ(11) త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో భారత్ స్కోరు నెమ్మదించింది.

    స్పిన్నర్లు చుక్కలు చూపించారు

    203 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఓవర్ లోనే కెప్టెన్ మార్క్రం(8) వికెట్ కోల్పోయింది. అతడిని అర్ష్ దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మెలికలు తిరిగే బంతులు వేసి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను అవుట్ చేశారు. స్టబ్స్(11), మిల్లర్(18) నిరాశ పరచడంతో సౌత్ ఆఫ్రికా ఓటమి పాలయింది. కాగా, ఈ మ్యాచ్ లో 10 సిక్స్ లు కొట్టిన సంజు.. రోహిత్ సరసన నిలిచాడు.