https://oktelugu.com/

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కు తృటిలో తప్పిన ప్రమాదం…వీడియో వైరల్…

రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 09:43 AM IST

    Vijay Devarakonda's accident narrowly missed...video viral...

    Follow us on

    Vijay Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈయన చేసిన సినిమాలు కూడా అతనికి మంచి విజయాలను కట్టబెట్టాయి. దాంతో తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగడమనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయనతోపాటుగా మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా తమదైన రీతి లో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడనే టాక్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది… ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ పెను ప్రమాదం నుంచి పితప్పించుకున్నాడు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి రీసెంట్ గా ఆయన మెట్ల మీద నుంచి కాలుజారి కింద పడ్డాడు దాంతో ఒక్కసారిగా అతని ఫాన్స్ ఆందోళనకు గురైనప్పటికీ ఆయనకు పెద్దగా ఇబ్బంది కలిగించే విధంగా గాయాలు ఏమీ తగలకపోవడం అందరు ఒక్కసారి గా ఊపిరి పీల్చుకున్నారు…ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ ఎలా మెట్ల మీద నుంచి జారి పడ్డాడు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

    హాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ అయిన జాస్లీన్ రాయల్ తో ఆయన గత కొంతకాలం నుంచి మంతనాలు జరుపుతున్నాడు. ఎందుకు అంటే ఆయన చేసే ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో విజయ్ నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జాస్లిన్ రాయల్ కంపోజ్ చేసిన చాలా సాంగ్స్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయనే చెప్పాలి…

    ఇక అందులో భాగంగానే విజయ్ ముంబై లోని మిథిబాయి క్షితిజ్ కాలేజ్ వాళ్ళు నిర్వహించిన యానివల్ ఫెస్ట్ డే లో భాగం గా ‘సాహిబా ‘ అనే సాంగ్ లో పాల్గొనడానికి విజయ్ అక్కడికి వచ్చాడు… దాంతో అక్కడ అతను మెట్లు దిగుతుంటే జారిపడ్డాడు. ఇక వెంటనే అతని టీం అలర్ట్ అయి అతన్ని పైకి లేపారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ చాలా సేఫ్ అయ్యాడనే విషయాన్ని తెలుసుకున్న అతని అభిమానులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు…

    ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక సినిమాలే కాకుండా మధ్య మధ్యలో ఇలాంటి ఆల్బమ్స్ కూడా చేస్తుండడం అతని ఫాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తుంది… ఇక ఈ సాంగ్ ని నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…