https://oktelugu.com/

SA : దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర.. WTC finals 2025 లోకి దర్జాగా ఎంట్రీ..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టీమిండియా రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2024 / 07:42 PM IST

    South Africa

    Follow us on

    WTC finals 2025 : కొంతకాలంగా సంచలన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఎట్టకేలకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ -2025 లోకి ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడం ఇదే తొలిసారి.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టీమిండియా రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

    సెంచూరియన్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ తో తొలి టెస్ట్ లో తలపడింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని అతి కష్టం మీద సాధించింది. 8 వికెట్ల నష్టపోయి 150 పరుగులు చేయగలిగింది. ఈ విజయం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి దక్షిణాఫ్రికా వెళ్ళింది. ఫైనల్ బెర్త్ ను దర్జాగా ఖాయం చేసుకుంది. అయితే ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టే జట్టు ఏదో ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ రేసులో కంగారులు ముందు వరుసలో ఉన్నారు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ పాయింట్లు పట్టికలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది. నాలుగు స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి.

    ఒక మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు..

    రెండవ స్థానానికి పోటీపడే జట్లు తాము ఆడబోయే మ్యాచ్లలో ఒకటి గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి.. ఒకవేళ మ్యాచ్ టై గనుక అయితే ఆరు పాయింట్లు దక్కుతాయి. డ్రా అయితే నాలుగు పాయింట్లు సొంతమవుతాయి. ఈ పాయింట్ల పర్సంటేజ్ ఆధారంగా ఐసీసీ ఆయా జట్లకు ర్యాంకులను ప్రకటిస్తుంది. అయితే ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 11 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెంచూరియన్ మైదానంలో తొలి టెస్ట్ లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 211 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 237 రన్స్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 301 రన్స్ చేసింది. తద్వారా 90 పరుగుల లీడ్ సాధించింది.. రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 237 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ఎదుట 147 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అయితే దీనిని చేదించడానికి దక్షిణాఫ్రికా జట్టు చివరి వరకు పోరాడింది. ఒకానొక దశలో 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమి అంచులో నిలిచింది. ఆ దశలో క్రీజ్ లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు రబాడ, మార్కో జాన్సన్ పాకిస్తాన్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.. జట్టుకు చివరికి విజయాన్ని అందించారు.. పాకిస్తాన్ బౌలర్ల దూకుడు వల్ల దక్షిణాఫ్రికా ప్లేయర్లు టోనీ 2, మార్క్ రమ్ 37, రికెల్టన్ 0, స్టబ్స్ 1, బవుమా 40, డేవిడ్ బెడింగ్హమ్14, కైలే వెర్రియిన్ 2, కార్బిన్ బోష్ 0 పరుగులు చేశారు. లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జెన్ సెన్, కగిసో రబడా పాకిస్తాన్ బౌలర్లను ధైర్యం గా ఎదుర్కొన్నారు. జెన్ సెన్ 16, రబాడా 31 పరుగులతో అజేయంగా నిలిచారు.