https://oktelugu.com/

Tollywood Heros : 2024 లో ఈ స్టార్ హీరోల క్రేజ్ భారీగా తగ్గిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలోకి ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చాలామంది హీరోలు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. మరి 2025వ సంవత్సరంలో అయిన వీళ్ళు సక్సెస్ బాట పడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : December 29, 2024 / 08:00 PM IST

    Tollywood Heros

    Follow us on

    Tollywood Heros :  2024వ సంవత్సరంలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి కొందరికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెసులు లభించాయి. మిగతా హీరోలందరూ వాళ్ళ సినిమాలతో ఏమాత్రం మ్యాజిక్ ని చేయలేకపోయారు. కారణం ఏదైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ కెరియర్ ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. తద్వారా మహేష్ బాబు క్రేజ్ అనేది భారీగా తగ్గిపోయిందనే చెప్పాలి. గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు ఏమీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఘోరంగా ఇమేజ్ డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ఇక వెంకటేష్ హీరోగా శైలేష్ కొలన్ దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ సినిమా కూడా ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. నాగార్జున హీరోగా వచ్చిన నా సామి రంగ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది…ఇక ఈ సినిమాలతో పాటుగా రామ్ హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఇలా స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమాలేవి పెద్దగా మెప్పించకపోవడంతో వాళ్ళు కూడా ప్లాప్ లా బాట పట్టారు.

    ఇక 2024 వ సంవత్సరం ఈ స్టార్ హీరోలకి ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. మరి 2025 వ సంవత్సరంలో అయిన మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వెంకటేష్ ఇప్పటికే ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే సినిమాతో 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

    అలాగే నాగార్జున కూడా 2025 సంవత్సరంలో తన కొత్త సినిమాని స్టార్ట్ చేసి ఆ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ సినిమాలో రిలీజ్ చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం రామ్ కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేష్ బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమాతో 2025లో బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ తెలుగు స్టార్ హీరోలందరూ సూపర్ సక్సెస్ సాధించినప్పుడే ఇండస్ట్రీలో మంచి విజయాలు నమోదవ్వడమే కాకుండా వాళ్లందరికి భారీ గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పాలి…