https://oktelugu.com/

Game Changer Trailer: జనవరి 1 న ‘గేమ్ చేంజర్’ థియేట్రికల్ ట్రైలర్..సీఎం, పోలీస్,ఐఏఎస్ గా రామ్ చరణ్ నట విశ్వరూపం..డైలాగ్స్ లీక్!

ఎట్టకేలకు 'గేమ్ చేంజర్' థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు దిల్ రాజు అధికారిక ప్రకటన చేసాడు. నేడు విజయవాడ లో రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు ఈ విషయాన్నీ అభిమానులతో చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 29, 2024 / 07:42 PM IST
    Follow us on

    Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం అటు అభిమానులు,ఇటు ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం రామ్ చరణ్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ట్విట్టర్ లో మేకర్స్ ని ట్యాగ్ చేస్తూ చుక్కలు చూపించారు. ఇప్పటికీ కూడా వాళ్ళు మేకర్స్ పై అసహనం తో ఉన్నారు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలై చాలా రోజులైంది. కల్కి, దేవర, పుష్ప 2 రేంజ్ లో బుకింగ్స్ ని నమోదు చేసుకొని ఆల్ టైం ప్రీమియర్ రికార్డు గ్రాస్ ని నెలకొల్పుతుందని అంచనాలు పెట్టుకుంటే, చాలా నార్మల్ గానే బుకింగ్స్ జరుగుతున్నాయి. అందుకు కారణం ‘గేమ్ చేంజర్’ కంటెంట్ ఏమిటో జనాలకు తెలియలేదు కాబట్టి. మన తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ వచ్చినా, రాకపోయినా టికెట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోతాయి.

    కానీ ఓవర్సీస్ లో ఒక ప్రేక్షకుడు 25 డాలర్లు పెట్టి సినిమాకి వెళ్లాలంటే కచ్చితంగా ఆ ప్రేక్షకుడికి ఈ సినిమాని చూడాలి అనే కుతూహలం కలగాలి. ‘గేమ్ చేంజర్’ అలాంటి ఫ్యాక్టర్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. అందుకే ఆశించిన స్థాయి బుకింగ్స్ జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ పెరగాలంటే కచ్చితంగా ట్రైలర్ రావాల్సిందే. ఆ ట్రైలర్ ని జనవరి 4 వరకు విడుదల చేయరు అని సోషల్ మీడియా లో ఒక వార్త వినిపించింది. దీనికి అభిమానులకు విపరీతమైన కోపం వచ్చేసింది. సినిమా హైప్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారంటూ దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు దిల్ రాజు అధికారిక ప్రకటన చేసాడు. నేడు విజయవాడ లో రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు ఈ విషయాన్నీ అభిమానులతో చెప్పుకొచ్చాడు.

    ఈ సినిమాలో రామ్ చరణ్ కేవలం IAS అధికారిగా మాత్రమే కాదు, ఒక పోలీస్ అధికారిగా,రాష్ట్రానికి సీఎం గా కూడా కనిపించబోతున్నాడట. ఒక్కమాటలో చెప్పాలంటే రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారంటూ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు.సినిమా స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉంటుందట. ఇప్పటి వరకు శంకర్ తీసిన అన్ని సినిమాలలో ‘గేమ్ చేంజర్’ ది బెస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. సినిమా నిడివి కేవలం 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉంటుందట. థియేట్రికల్ ట్రైలర్ కూ రెండు నిమిషాల 45 సెకండ్స్ ఉంటుందట. ఈ ట్రైలర్ సినిమా రేంజ్ ఏంటో చెప్పేలా ఉంటుందని, రామ్ చరణ్ పలికే డైలాగ్స్ అదిరిపోతాయని అంటున్నారు. ట్రైలర్ కట్ అయితే సిద్ధం గా ఉందని, ఇంకా దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు పలు చోట్ల VFX వర్క్ బ్యాలన్స్ ఉందని, దాని మీద పని చేస్తున్నామని, కొత్త సంవత్సరం లో మేము విడుదల చేయబోయే ట్రైలర్ ని చూసి పిచ్చెక్కిపోతారు అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.