Afghanistan Vs South Africa Semi Final: వేగానికి కొలమానంగా ఉండే టీ -20 క్రికెట్ లో అప్పుడప్పుడు బౌలర్లు కూడా ప్రతాపం చూపిస్తారు. తమదైన రోజున ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తారు. ఇలాంటి సంఘటనలు టి20 క్రికెట్లో అరుదుగా చోటుచేసుకుంటాయి. ఇంతకీ టి20 వరల్డ్ కప్ లో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
ఇంగ్లాండ్ తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్..
2021 టి20 వరల్డ్ కప్ లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 55 పరుగులకే కుప్పకూలింది. టి20 వరల్డ్ కప్ లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ తర్వాతి స్థానం లో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. 2024 టి20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ లోని ట్రీని డాడ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే కుప్ప కూలింది. రబాడా, జాన్సన్ దెబ్బకు టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. 2014లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో చట్టో గ్రామ్ వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 60 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 2016లో కోల్ కతా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 70 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
ఆఫ్ఘనిస్తాన్ అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన మ్యాచ్లు ఇవే..
2024 t20 వరల్డ్ కప్ లో భాగంగా ట్రీని డాడ్ లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తలపడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. 56 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. 2014లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 72 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది. 2010లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 80 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 2012లో కొలంబో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తలపడింది.. ముందుగా బ్యాటింగ్ చేసి 80 పరుగులకే కుప్పకూలింది.
సౌత్ ఆఫ్రికా చేతిలో..
సౌత్ ఆఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ అత్యల్ప స్కోర్లు నమోదు చేయడం ఇది మూడవసారి.. 2024 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ లోని ట్రీనిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 2024 న్యూయార్క్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 77 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 2010 t20 వరల్డ్ కప్ లో భాగంగా బ్రిడ్జి టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ – దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 80 పరుగులకే కుప్ప కూలింది.