Pushpa 2 Postponed: పుష్ప 2 వాయిదా… పవన్ కళ్యాణ్ తో విబేధాల వల్ల అల్లు అర్జున్ కెరియర్ ఎటు పోతోంది..?

పుష్ప 2 సినిమా పరిస్థితి కనక తేడా కొడితే ఆయన పరిస్థితి ఏంటి అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : June 27, 2024 8:41 am

Pushpa 2 Postponed

Follow us on

Pushpa 2 Postponed: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకుంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలైతే ఉన్నాయి. అయినప్పటికీ ఈమధ్య ఎలక్షన్స్ క్యంపెనింగ్ విషయం లో ఏర్పడిన వ్యతిరేకతతో ఆయన మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. దానివల్ల పుష్ప 2 సినిమాను మేకర్స్ ఆగస్టు 15 నుంచి తప్పుకుంటూ ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో ఎందుకు పెట్టుకుంటున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక వీళ్లు తొందర్లోనే కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే ఆయన సినిమాల మీద కూడా కొంతవరకు నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారనే టాక్ అయితే వస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే అల్లు అర్జున్ ఈ సినిమా క్యాన్సిల్ అవడంతో కొంతవరకు డౌన్ ఫాల్ లో ఉన్నాడు.

మరి ఇప్పుడు పుష్ప 2 సినిమా పరిస్థితి కనక తేడా కొడితే ఆయన పరిస్థితి ఏంటి అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆదరిస్తుంది. కాబట్టి ఈ సినిమా మీద ఆయన మంచి కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలని అనుకుంటున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి పవన్ కళ్యాణ్ అభిమానులను ఎదిరించి అల్లు అర్జున్ హిట్టు కొడతాడా లేదా అనేది…