https://oktelugu.com/

Sourav Ganguly- Virat Kohli: టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామాపై సంచలన నిజం వెలుగులోకి..

డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లో తొలి రోజు ఫీల్డింగ్ సెట్టింగులు, బౌలర్లను ఉపయోగించుకున్న తీరు కూడా విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ గా నిలిచిన విరాట్ కోహ్లీకి మళ్ళీ టెస్ట్ జట్టు పగ్గాలు అందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Written By:
  • BS
  • , Updated On : June 13, 2023 / 10:48 AM IST

    Sourav Ganguly- Virat Kohli

    Follow us on

    Sourav Ganguly- Virat Kohli: డబ్ల్యూటిసి ఫైనల్ లో భారత జట్టు ఘోర పరాభవం తరువాత అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్లపై అభిమానులతోపాటు మాజీ భారత క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, అశ్విన్ ను పక్కన పెట్టడం వంటి చెత్త నిర్ణయాలు తీసుకున్నందుకు రోహిత్ ను ఫ్యాన్స్ తోపాటు మాజీలు కూడా తిట్టి పోస్తున్నారు.

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో వరుసగా రెండోసారి కూడా భారత జట్టు ఓటమి చవి చూసింది. రెండేళ్ల కిందట జరిగిన తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలు కాగా, నాలుగు రోజుల కిందట జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీకి మళ్లీ పగ్గాలు అందించాలన్న డిమాండ్ ను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

    కోహ్లీకి పగ్గాలు అప్పగించాలంటూ డిమాండ్..

    డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లో తొలి రోజు ఫీల్డింగ్ సెట్టింగులు, బౌలర్లను ఉపయోగించుకున్న తీరు కూడా విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ గా నిలిచిన విరాట్ కోహ్లీకి మళ్ళీ టెస్ట్ జట్టు పగ్గాలు అందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతేడాది అంటే 2022లో టెస్ట్ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఆ సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలి ఉన్నాడు. బోర్డుతో విభేదాలు కారణంగా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోహ్లీ ఇలా టెస్ట్ కెప్టెన్సీ ఎందుకు వదులుకున్నాడో బోర్డుకు కూడా తెలియదని గంగూలీ చెప్పాడు. అలాగే, కోహ్లీ రిజైన్ చేస్తాడని తామెవరమూ ఊహించలేదని గంగూలి వెల్లడించాడు.

    కోహ్లీ నిర్ణయంతో షాక్ కు గురయ్యాం..

    ఈ సందర్భంగా మరిన్ని వ్యాఖ్యలు చేసిన గొంగూలి అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో బోర్డుకు ఏమాత్రం సంబంధం లేదని దాదా చెప్పాడు. కోహ్లీ తప్పుకుంటాడని మేం ఎవరు కూడా అనుకోలేదని, అతని నిర్ణయం తెలిసి షాక్ అయిపోయామని వెల్లడించాడు. అప్పుడు బెస్ట్ చాయిస్ రోహిత్ అని భావించి అతనికే టెస్ట్ కెప్టెన్సీ కూడా అప్పగించామని, అంతేకానీ కోహ్లీ రాజీనామా విషయంలో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని గంగూలీ స్పష్టం చేశాడు. కోహ్లీ ఎలా టెస్ట్ కెప్టెన్షి నుంచి తప్పుకోవడానికి బీసీసీఐ ప్రిపేర్ కాలేదని, మాకు అది చాలా అన్ ఎక్స్ పెక్టెడ్ నిర్ణయంగా కనిపించిందని స్పష్టం చేశాడు గంగూలి. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే చెప్పగలడు అని దాదా వివరించాడు. అయినా అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం లాభం లేదని, అప్పట్లో కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్ కు సెలక్టర్లు ఈ బాధ్యతలు అప్పగించారు అని గంగోలి వివరించాడు. డబ్ల్యూటిసి ఫైనల్ ఓటమి తర్వాత గంగూలి చేసిన ఈ వ్యాఖ్యలకు ఆసక్తి పెరిగింది.