Sourav Ganguly: కోల్ కతా జట్టుకు యజమానిగా షారుక్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.. ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించడం.. వారికి అవకాశాలు ఇవ్వడంలో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. అయితే అతనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఐదు నిమిషాల్లో సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ షారుక్ ఖాన్ కు 400 మెసేజ్ లు పంపించారట. గత సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది.. అయితే అంతకంటే ముందు మూడు సీజన్లలో కోల్ కతా జట్టు కనీసం ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేకపోయింది. అప్పుడు గంగూలీ కోల్ కతా జట్టుకు సారథ్యం వహించారు. దీంతో షారుక్ ఖాన్ 2011 మెగా వేలంలో దాదా ను రిటైన్ చేసుకోలేదు. కనీసం మెగా వేలంలో అతడి కోసం బిడ్డింగ్ కూడా దాఖలు చేయలేదు. షారుక్ ఖాన్ వ్యవహార శైలి పట్ల దాదా అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్ కతా యాజమాన్యం తీరు సరిగ్గా లేదంటూ మండిపడ్డారు. అయితే ఇప్పుడు నాటి సంగతులను కోల్ కతా మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య వెల్లడించారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
ఓ కార్యక్రమంలో జాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటి సంగతులను ఆయన ఒక్కసారిగా గుర్తుకు చేసుకున్నారు. ఓ కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు..” గంగూలీ అభిమానుల నుంచి షారుక్ ఖాన్ తీవ్ర అగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. నాడు గంగూలిని తిరిగి జట్టులోకి తీసుకునే విషయంలో షారుక్ ఖాన్ సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొన్నారు. గంగూలీ కోసం నాడు షారుక్ ఖాన్ బిడ్ కూడా దాఖలు చేయలేదు. దీంతో ఐదు నిమిషాల్లోనే 400 మెసేజ్ లు వచ్చాయి. ఒకానొక దశలో ఫోన్ పగిలిపోతుందేమోనని అనిపించింది. బెంగాలీ రాజసాన్ని మోసం చేసిన వ్యక్తి అంటూ నా గురించి అన్ని గ్రూపులలో సందేశాలను ఫార్వర్డ్ చేశారు. ఇది తీవ్ర స్థాయికి చేరడంతో.. మా నాన్నకు ఫోన్ చేశాను. కోల్ కతా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న మా ఇంటి వద్ద ఉన్న అడ్రస్ బోర్డును తొలగించాలని చెప్పాను.. నాడు గంగూలీని జట్టులోకి తీసుకునే విషయంలో షారుక్ ఖాన్ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన జట్టులో ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడారు. గంగూలీని కావాలంటే తీసుకోండి, అవసరం లేదనుకుంటే వదిలేయండి.. మీ ఇష్టానుసారంగా వ్యవహరించండి.. నేను అందులో జోక్యం చేసుకోలేనని షారుక్ ఖాన్ చెప్పారు. అయితే అప్పుడు నేను, కోచ్, సీఈవో కూడా అక్కడే ఉన్నారు.. ఆ తర్వాత గంగూలిని తిరిగి జట్టులోకి తీసుకునే విషయంలో మిగతా కార్యవర్గం అంతగా ఆసక్తి చూపించలేదు. అది ఈ స్థాయిలో పరిణామానికి దారి తీస్తుందని మేము ఊహించలేదు. అందువల్లే బెంగాల్ లోని దాదా ఫ్యాన్స్ తమ అసలు రూపాన్ని షారుక్ ఖాన్ కు చూపించారు. నాటి రోజులను ఏమాత్రం మర్చిపోలేను. మర్చిపోయి అంత సులువైన రోజులు కావాలి. చివరికి మా ఇంటి బోర్డు కూడా తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. ఏ స్థాయిలో దాదా ఫ్యాన్స్ హంగామా చేశారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” భట్టాచార్య పేర్కొన్నారు.