Sourav Ganguly: చిరస్థాయిగా క్రికెట్ ఆడి.. ఐపీఎల్ లోనూ తన సత్తా చాటి.. భారత క్రికెటర్ నియంత్రణ మండలిలో కీలక పదవులు అనుభవించి.. ఇప్పుడు ఐసీసీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. సాధారణంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన గంగూలీ.. రాజకీయాలకు దూరంగా ఉంటాడు.. గతంలో గంగూలీపై అనేక రకాల వ్యాఖ్యలు వినిపించినప్పటికీ.. ఆయన ఎన్నడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయ పార్టీలకు దగ్గరగా వెళ్లలేదు. తన పని ఏదో తను చూసుకున్నాడు. అంత తప్ప రాజకీయ పార్టీలలో వేలు పెట్టలేదు. కనీసం రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యాఖ్యలు కూడా చేయలేదు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు గంగూలికి సంబంధించి పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. తమ పార్టీలో గంగూలీ చేరుతాడని పేర్కొన్నాయి. కానీ వాటి అన్నిటినీ కూడా గంగూలీ పలు సందర్భాల్లో తిరస్కరించాడు.
Also Read: మొదటి అర్ధ భాగం ముగిసింది.. ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఏవంటే?
మాస్ వార్నింగ్
ముందే చెప్పినట్టు రాజకీయాలకు గంగూలి మొదటి నుంచి దూరం. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల సమస్యపై రగడ జరుగుతోంది.. ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని గంగూలీని వారు కోరారు. వారంతా కూడా గంగూలీని కలిసి తమ సమస్యను చెప్పారు. ఆ సమస్యను సావధానంగా విన్న గంగూలీ.. తనదైన స్పందన తెలియజేశాడు. ” నన్ను ఎందుకు మీరు రాజకీయాల్లోకి లాగుతున్నారు? అసలు ఈ వివాదంతో నాకు ఎటువంటి సంబంధం ఉంది? మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నేను ప్రభుత్వంలో లేను. మీరు ఉద్యోగాలు సాధించినప్పుడు నన్ను కలవలేదు. ఇప్పుడు ఉద్యోగాలు పోగానే నా దగ్గరికి వచ్చారు. అసలు ఇటువంటి సంఘటనతో నాకు సంబంధం ఎందుకు అంటగడుతున్నారు.. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. మీ వ్యక్తిగత విషయాలు నాకు ఆపాదించకండని” గంగూలీ వారితో వ్యాఖ్యానించాడు.. అయితే రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే గంగూలీ ఏదో విధంగా ఈ విషయంలో స్పందించే వాడు. కానీ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని గంగూలీ ఫిక్స్ అయ్యాడు కాబట్టి తన వైఖరి వెల్లడించాడు. భవిష్యత్ కాలంలో రాజకీయాల్లోకి వచ్చేది లేదని.. రాజకీయాల్లోకి రావాలని లేదని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని గంగూలి ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అందువల్లే తన వైఖరి మొత్తం స్పష్టంగా చెప్పేశాడు.. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు ఉసురుమంటూ వెళ్లిపోయారు. అన్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయిన వారి అంశం వివాదాస్పదంగా మారింది. అది అక్కడి రాజకీయాలలో కలకలం రేపుతోంది. తమ ఉద్యోగాలు తమకే ఇవ్వాలని.. తమను ఉపాధ్యాయ కొలువులలో కొనసాగించాలని అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు కొన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. మరికొన్ని పార్టీలు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా ఈ సంఘటన బెంగాల్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
Also Read: 18 ఏళ్ల క్రితం సంచలనం.. ఇప్పుడేమో యాదృచ్ఛికం.. ఐపీఎల్ లో ఇదో అద్భుతం!