IPL 2025: 18వ ఎడిషన్ లో ఢిల్లీ జట్టు ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడింది. పంజాబ్ జట్టు ఏడు మ్యాచులు ఆడి ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. గుజరాత్, బెంగళూరు, లక్నో జట్లు నాలుగు విజయాలతో సమానంగా ఉన్నాయి. కోల్ కతా, ముంబై 6 పాయింట్లతో ఆరు, ఏడు స్థానాలలో కొనసాగుతున్నాయి. ఈ సీజన్ దాదాపు అర్థ భాగం ముగిసింది. ఇక రాజస్థాన్, చెన్నై, హైదరాబాద్ ఏడు గేమ్ లు ఆడి.. నాలుగు పాయింట్లతో చివరి మూడు స్థానాలకు కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతానికి నాలుగు ప్లే ఆఫ్ స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్ జట్లు అనుకూలమైన పాయింట్లు కలిగి ఉన్న నేపథ్యంలో.. అవి తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది.. ఈ సీజన్లో బెంగళూరు జట్టు వరుసగా సొంత మైదానంలో మూడవ మ్యాచ్ ఓడిపోయింది.. దీనికి తోడు ప్రతి సీజన్లో సెకండ్ హాఫ్ లో కీలకమైన మ్యాచ్లలో ఓడిపోయిన చరిత్ర బెంగళూరు జట్టుకుంది. మరోవైపు సరైన సమయంలో ముంబై జట్టు రాణిస్తోంది. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది.. ఇక ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్లకు ఐదింట్లో విజయం సాధించింది. పంజాబీ కింగ్స్ ఎలెవన్ ఏడు మ్యాచ్ లు ఆడి ఐదింట్లో గెలిచింది. గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచులు ఆడి.. నాలుగింట్లో గెలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఏడు మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలిచాయి..కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్ లు ఆడి మూడింట్లో గెలిచాయి. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఏడు మ్యాచ్ లు ఆడి.. కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచాయి.
Also Read: నితీష్ భాయ్.. ఇదా ఆట.. ఇదేనా నీ ఆట..
గత సీజన్లో ఏం జరిగిందంటే..
గత సీజన్లో సెకండ్ హాఫ్ లో బెంగళూరు జట్టు సూపర్ ఆట తీరు ప్రదర్శించింది. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది.. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. ఏకంగా ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. అయితే సెకండ్ హాఫ్ లో అట్టడుగున ఉన్న హైదరాబాద్, చెన్నై జట్లు దూకుడు కొనసాగించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ రెండు జట్లలో భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిదైన రోజున విధ్వంసం సృష్టించగలరు. ప్రస్తుతం పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు టాప్ -4 లో కొనసాగుతున్నప్పటికీ.. తదుపరి జట్లు దూకుడు కొనసాగిస్తే ముఖ్యంగా బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బెంగళూరు జట్టుకు ఎలాగూ ఆరంభ శూరులు అనే పేరుంది. ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో గనక అదే కొనసాగితే.. ఆ పదం బెంగళూరు జట్టు ఆటగాళ్లకు ఎప్పటికి స్థిరపడిపోతుంది.
Also Read: ముంబై వదిలించుకున్న శనిని హైదరాబాద్ 11.25 కోట్లకు కొని అనుభవిస్తోంది..