Homeక్రీడలుక్రికెట్‌Smriti Mandhana Statement: క్రికెట్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మాత్రమే కాదు.. స్మృతి సాలిడ్...

Smriti Mandhana Statement: క్రికెట్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మాత్రమే కాదు.. స్మృతి సాలిడ్ షాట్ కు బిసిసిఐ, ఐసీసీ కి ఎక్కడో కాలుతోంది..

Smriti Mandhana Statement: నిజమే క్రికెట్ అనేది కమర్షియల్ గేమ్. కాకపోతే దాంట్లో జెంటిల్మెన్ అనే పదాన్ని కొంతకాలంగా ఐసీసీ.. బిసిసిఐ మర్చిపోయాయి. అందువల్ల ఆ గేమ్ కాస్త దారి తప్పుతోంది. డబ్బులపరంగా బాగానే వస్తున్నప్పటికీ.. విలువలు కోల్పోవడంతో ఐసీసీ.. బీసీసీఐ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలంగా మాజీ క్రికెటర్లు.. అభిమానులు మాత్రమే ఈ స్థాయిలో విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి తొలిసారిగా భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న స్మృతి మందాన చేరింది.

స్మృతి తక్కువగా మాట్లాడుతుంటుంది. కానీ ఆమె మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉంటుంది. అందువల్లే ఆమెకు ఈ స్థాయిలో అభిమానుల సపోర్ట్ ఉంది. తాజాగా క్రికెట్ గురించి.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో సరికొత్త చర్చకు దారితీసాయి.

మహిళా టి20 ప్రపంచ కప్ ఈనెల 12 నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 14న బర్నింగ్ హం ప్రాంతంలో టీమిండియా, పాకిస్తాన్ మహిళలు పోటీ పడతారు. ఈ మ్యాచ్ మీద ఐసీసీ.. బిసిసిఐ భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి . టికెట్లు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గురించి స్మృతి మాట్లాడింది.

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో బర్మింగ్ హామ్ ప్రాంతంలో భారత్, పాకిస్తాన్ పోటీపడ్డాయి. అప్పుడు కూడా టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. అయితే ఇప్పుడు కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ గురించి చర్చ నడుస్తోంది. కేవలం ఈ మ్యాచ్ గురించి మాత్రమే కాదు.. మొత్తం మహిళల టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడాలి. ఈ టోర్నీకి విశేషమైన ప్రాధాన్యం కల్పించాలి. అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ మీద బలమైన ఆట తీరు కొనసాగిస్తామనే నమ్మకం ఉందని” మందాన వ్యాఖ్యానించింది.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ ఏ లో ఉంది. తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్తో ఆడుతుంది. జూన్ 17న నెదర్లాండ్స్.. జూన్ 21న సౌత్ ఆఫ్రికా.. జూన్ 25న బంగ్లాదేశ్.. జూన్ 28న ఆస్ట్రేలియా జట్లతో పోటీ పడుతుంది. ఇక తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సిరీస్లో టీమిండియా ఒకదాంట్లో మాత్రమే గెలిచింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular