https://oktelugu.com/

Smriti Mandana : ఇన్ స్టాలో స్మృతి మందాన పోస్ట్.. ముక్కలైన కుర్రాళ్ళ గుండెలు

ఆ అప్పట్లో స్మృతి విలేకరులతో మాట్లాడుతూ... తనకు కాబోయే వాడి గురించి చెప్పింది. "ప్రతి మహిళ జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్య ఘట్టం. నాకు కాబోయే భర్త మంచి మనసున్న వాడై ఉండాలి. తను జాగ్రత్తగా చూసుకోవాలి. కెరియర్లో నేను బాగా బిజీ అయిపోయి.. తనకు సమయం ఏమాత్రం కేటాయించకపోయినా.. నన్ను అర్థం చేసుకోవాలి. నన్ను ప్రోత్సహించాలి" అంటూ స్మృతి తన మనసులో మాటను బయటపెట్టింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2024 / 10:29 PM IST

    Smruthi Mandana

    Follow us on

    Smriti Mandana : “ఆట ఉంటే అందం ఉండదు.. అందం ఉంటే ఆట ఉండదు.. ఈ రెండు ఉన్న వారి మనసు ఖాళీగా ఉండదు” టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన ఇన్ స్టా లో పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఇలానే వ్యాఖ్యానిస్తున్నారు.. ఆమె పోస్ట్ చేసిన ఫోటో చూసి కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.

    స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా మహిళా క్రికెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఘనత ఆమె సొంతం. వేగవంతమైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, మెలితిప్పే బంతులు వేసి స్టార్ క్రికెటర్ గా అవతరించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది.. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో చేసిన ఒక పోస్ట్ యువకుల హృదయాలను ముక్కలు చేసింది..

    స్మృతి మందాన కొంతకాలంగా మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ తో ప్రేమ లో ఉంది. అతనితో ఉన్న అనుబంధాన్ని ఆమె బహిర్గతం చేసింది. తమ ఐదేళ్ల బంధానికి గుర్తుగా పలాశ్ తో కలిసి ఆమె కేక్ కట్ చేసింది. ఈ ఫోటోలను అతడు తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని పలు స్పోర్ట్స్ చానల్స్, మ్యాగ్జిన్స్ కోడై కూశాయి. వాటిని బహిర్గతం చేస్తూ స్మృతి పలాశ్ తో కేక్ కట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    పలాశ్ కు 29 సంవత్సరాలు. ఇతడు ఒక సంగీత దర్శకుడు. టి సిరీస్, జి మ్యూజిక్ కోసం అనేక మ్యూజిక్ వీడియోలు చేశాడు.. రిక్షా అనే వెబ్ సిరీస్, అర్ద్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన “ఖేలే హమ్ జీ జాన్ సే” చిత్రంలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనేతో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు.. ఇక ఇతని సోదరి ఫలక్ ముచ్చల్ కూడా గాయనిగా రాణిస్తోంది. గతంలో స్మృతి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు పియానో వాయించింది. ఈ వీడియోను పలాశ్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసి.. “కొత్త విద్యార్థి వచ్చింది” అంటూ రాసుకొచ్చాడు.

    ఆ అప్పట్లో స్మృతి విలేకరులతో మాట్లాడుతూ… తనకు కాబోయే వాడి గురించి చెప్పింది. “ప్రతి మహిళ జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్య ఘట్టం. నాకు కాబోయే భర్త మంచి మనసున్న వాడై ఉండాలి. తను జాగ్రత్తగా చూసుకోవాలి. కెరియర్లో నేను బాగా బిజీ అయిపోయి.. తనకు సమయం ఏమాత్రం కేటాయించకపోయినా.. నన్ను అర్థం చేసుకోవాలి. నన్ను ప్రోత్సహించాలి” అంటూ స్మృతి తన మనసులో మాటను బయటపెట్టింది.