https://oktelugu.com/

అయినా.. ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు

మ్యాచ్‌లో గెలుపొందాలని ఒక్కోసారి కంగారూలు లేనిపోని కొత్త నాటకాలకు తెరతీస్తుంటారు. మొదటినుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లకు అదోరకం మెంటాలిటీ. తప్పు చేసినా స్లెడ్జింగ్ చేసిన చివరికి విజయం దొరికితే చాలు అని అనుకుంటారు. మ్యాచ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ బాగా చేస్తున్నా ఓర్చుకోలేరు. ప్రత్యర్థి జట్టు బౌలర్ వికెట్స్ తీస్తుంటే వారితో గొడవకు దిగుతుంటారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ కూడా ప్రస్తుతం అలాగే ప్రవర్తిస్తున్నాడు. Also Read: సిడ్నీ టెస్ట్: గోడకట్టిన అశ్విన్, […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 11, 2021 / 03:26 PM IST
    Follow us on


    మ్యాచ్‌లో గెలుపొందాలని ఒక్కోసారి కంగారూలు లేనిపోని కొత్త నాటకాలకు తెరతీస్తుంటారు. మొదటినుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లకు అదోరకం మెంటాలిటీ. తప్పు చేసినా స్లెడ్జింగ్ చేసిన చివరికి విజయం దొరికితే చాలు అని అనుకుంటారు. మ్యాచ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ బాగా చేస్తున్నా ఓర్చుకోలేరు. ప్రత్యర్థి జట్టు బౌలర్ వికెట్స్ తీస్తుంటే వారితో గొడవకు దిగుతుంటారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ కూడా ప్రస్తుతం అలాగే ప్రవర్తిస్తున్నాడు.

    Also Read: సిడ్నీ టెస్ట్: గోడకట్టిన అశ్విన్, విహారి.. ఛాన్స్ మిస్ చేసిన టీమిండియా

    రెండేళ్ల కిందట ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్ కెప్టెన్సీ పోవడమే కాదు ఆటగాడిగా కూడా ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. బాల్ ట్యాంపరింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో స్మిత్‌కు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏడాది నిషేధం అనంతరం తిరిగి జట్టులోకి వచ్చిన స్మిత్ ఏ మాత్రం మారినట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇండియాతో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

    ఈ రోజు మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడిని దెబ్బ తీయడం కోసం స్మిత్ చేసిన పని కెమెరాకు చిక్కింది. పంత్ డ్రింక్ తీసుకుంటుండగా క్రీజ్ దగ్గరికి వచ్చిన స్మిత్ పంత్ గార్డ్ మార్క్స్ ను షూలతో చెరిపేశాడు. తర్వాత పంత్ వచ్చి మళ్లీ గార్డ్ మార్క్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. వీడియోలో కూడా స్మిత్ 49 నంబర్ జెర్సీ క్లియర్‌‌గా కనిపించింది. స్టంప్ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యం కామెంట్ల దృష్టిలో పడి స్మిత్‌పై విమర్శలు కూడా చేశారు.


    Also Read: క్రికెట్ కే మచ్చ.. ఎన్నాళ్లీ తెల్లజాతి దురహంకారం?

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మరోసారి స్మిత్‌ను ఏకిపారేస్తున్నారు. ఏడాదిపాటు నిషేధానికి గురైనా స్మిత్ ఇంకా మారలేదని ట్రోల్ చేస్తున్నారు. అతడిని జీవితకాలం నిషేధించినా మార్పు రాదని కౌంటర్ లు వేస్తున్నారు. ప్రస్తుతం స్మిత్ చేసిన పని ఐసీసీ దృష్టికి వెళ్తే మాత్రం మరో మరోసారి అతడిపై చర్యలు తప్పేలా లేవు. రెండేళ్ల కిందట ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్ కెప్టెన్సీ పోగొట్టుకోవడంతోపాటు ఏడాదిపాటు జట్టుకు దూరమయ్యాడు. ఇంత జరిగినా స్మిత్‌కు బుద్ధి రాలేదంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.