కొన్ని సంవత్సరాలపాటు ఊరించి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. చివరి క్షణాల్లో తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే.. ఈ ప్రకటనను రజనీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో.. తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్.
Also Read: మరో బాదుడుకు రెడీ అయిన మోడీ సర్కార్
తన రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్‌స్టార్ అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి రానని, తనను ఇబ్బందికండి అని రజినీకాంత్ కోరారు. తన నిర్ణయాన్ని తాను ఇది వరకే వివరించానని చెప్పిన తలైవా.. దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దంటూ స్పష్టం చేశారు. రజినీకాంత్ తన విజ్ఞప్తిని లేఖ రూపంలో ట్విట్టర్ ద్వారా సోమవారం విడుదల చేశారు.
Also Read: కేంద్రంపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ : చట్టాలను నిలిపివేస్తారా.. లేదా..?
గతేడాది డిసెంబర్‌లో తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తానని రజినీకాంత్ తెలియజేసిన సంగతి తెలిసిందే. దీంతో తలైవా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని భావించిన అభిమానులకు నిరాశ కలిగింది. అనారోగ్యం కారణంగా తాను రాజకీయాల్లోకి రాలేనని రజినీకాంత్ స్పష్టం చేశారు. అయితే.. రజినీకాంత్ అభిమానులు మాత్రం తలైవా తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కోరుతున్నారు. కొందరు, రజనీ మక్కళ్ మండ్రం బాధ్యతల నుంచి, మండ్రం నుంచి తొలగించబడిన పలువురితో కలిసి చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆందోళన కూడా చేశారు. ఈ ఆందోళనపై స్పందించిన రజినీకాంత్ తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్