
బండి సంజయ్.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఆయన. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. పార్టీకి ఊపు తెచ్చిన లీడర్. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త నేత అయ్యారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా హెడ్ లైన్స్ లో ఉండే ఆయన.. ఈ మధ్యన తన దూకుడును మరింత పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా పెట్టుకొని ఊహించని రీతిలో విరుచుకుపడుతుంటారు. తాజాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలే కాదు బీజేపీ నేతలు సైతం విస్మయానికి గురవుతున్నారు.
Also Read: బిగ్ బ్రేకింగ్: తెలంగాణ స్కూళ్ల ఓపెనింగ్ తేది ప్రకటించిన సీఎం కేసీఆర్
మరో పదిహేను రోజుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తున్నారని.. కానీ అది జరగదని సంజయ్ పేర్కొన్నారు. మంత్రి పదవి రాకపోతే పార్టీ పెడతామని ముగ్గురు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని.. కేసీఆరే వారితో అలా మాట్లాడిస్తున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఆయన తండ్రి కేసీఆర్ ఏం చెబుతారో కూడా బండి సంజయ్ చెప్పేయటం గమనార్హం.
Also Read: అఖిలప్రియకు షాకిచ్చిన కోర్టు.. తీర్పు ఏంటంటే?
నిన్న మీడియా వేదికగా ఆయన మాట్లాడిన మాటలను పరిశీలిస్తే.. ‘వాళ్లు కొత్త పార్టీ పెడితే ప్రభుత్వం పడిపోతుందని.. అందువల్ల ముఖ్యమంత్రి అయ్యేందుకు కొద్ది రోజులు ఆగాలని కొడుక్కి కేసీఆర్ చెబుతారు. ఇంతకు ముందు సంతోష్ రావు పేరు చెప్పి ఆపారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పేరు చెప్పి ఆపుతున్నారు’ అని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అయితే.. సంజయ్ వ్యాఖ్యలను పరిశీలిస్తే కేసీఆర్ మెదడును బండి సంజయ్ ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తున్నారా అన్న సందేహం కలుగక మానదు. కొడుకు విషయంలో కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారన్న విషయం ఎక్కడో ఉండే బండికి ఎలా తెలుస్తుంది? కొంపదీసి కేసీఆర్ బ్రెయిన్ చిప్ ను యాక్సిస్ చేసే అవకాశం బండికి ఏమైనా ఉందంటారా..? ఇలాంటి ఫన్నీ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.