https://oktelugu.com/

IND Vs BAN: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ మొదలే కాలేదు.. టీమిండియా కు ఏంటీ ఎదురుదెబ్బలు?

IND vs BAN: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవాలని భారత జట్టు ఆశపడుతోంది. ఇందులో భాగంగా టెస్ట్ గదను దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టింది. గతానికంటే భిన్నంగా టెస్ట్ జట్టులో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.. రోహిత్, విరాట్, బుమ్రా మినహా మిగతా వారితో దేశవాళీ క్రికెట్ టోర్నీ ఆడించేందుకు రంగం సిద్ధం చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 29, 2024 / 05:40 PM IST

    IND Vs BAN

    Follow us on

    IND Vs BAN: వచ్చే నెలలో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. టెస్ట్ జట్టులో జవసత్వాలు నింపేందుకు బీసీసీఐ అందరి ఆటగాళ్లతో దేశవాళి క్రికెట్ టోర్నీ ఆడించనుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికే బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎదుర్కొనే ప్రతి టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం. పైగా సెప్టెంబర్ నుంచి టీమిండియా వరుసగా 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుతో ఆడే సిరీస్ కూడా ఎంతో కీలకం కానుంది. పైగా బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ పై ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుతో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. బంగ్లాదేశ్ తర్వాత ఆస్ట్రేలియా తో భారత్ అయిదు టెస్ట్ ల సిరీస్ ఆడుతుంది. నేను నీ దృష్టిలో పెట్టుకొని భారత స్టార్ పేస్ బౌలర్ బుమ్రా కు జట్టు నాయకత్వం విశ్రాంతి ఇచ్చింది. బుమ్రా తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటే షమీ ఇంతవరకు ఫిట్ నెస్ సాధించలేదు.. మరోవైపు మహమ్మద్ సిరాజ్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో భారత పేస్ దళం బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ముందు బలహీనంగా మారింది. దీంతో ఇతర బౌలర్ల పై జట్టు మేనేజ్మెంట్ దృష్టి సారించింది..షమీ కోలుకోకపోవడంతో అతడిని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. సిరాజ్ కూడా అనారోగ్యం వల్ల దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో నవదీప్ షైనీ కి అవకాశం లభించింది.

    కొత్తవారితో..

    అటు బుమ్రా కు విశ్రాంతి ఇవ్వడం, సిరాజ్ కు అనారోగ్యం, షమీ ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో.. భారత్ పేస్ బౌలర్ల విషయంలో ఆప్షన్స్ వెతుక్కుంటుంది. ప్రస్తుతానికి వైట్ బాల్ క్రికెట్ లో అర్ష్ దీప్ సింగ్ సత్తా చాటుతున్నాడు. అయితే అతడిని బంగ్లాదేశ్ టోర్నీకి ఎంపిక చేసే అవకాశం ఉంది.. రెడ్ బాల్ క్రికెట్ లో కూడా అతడు సత్తా చాటుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అర్ష్ దీప్ సింగ్ తో పాటు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ వంటి వారికి కూడా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ముఖేష్ ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఒకవేళ సిరాజ్ అప్పటివరకు కోలుకోకపోతే ముఖేష్ సీనియర్ పేస్ బౌలర్ గా కొనసాగుతాడు.. అయితే సిరాజ్ త్వరలోనే కోరుకుంటాడని బీసీసీఐ అంచనా వేస్తోంది.

    టెస్ట్ గద అందుకోవాలని..

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఈసారి ఎలాగైనా గెలవాలని భారత్ భావిస్తోంది. టెస్ట్ గద అందుకోవాలని యోచిస్తోంది. అయితే త్వరలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు సీనియర్ పేస్ బౌలర్లు రకరకాల కారణాలవల్ల జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో.. కొత్త బౌలర్లకు అవకాశాలు కల్పించి.. మెరుగైన ఫలితాలు రాబట్టాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే.. టీమిండియా బౌలింగ్ బలం మరింత పెరిగినట్టే.