https://oktelugu.com/

Shubman Gill : సచిన్ కూతురుతో కాదు.. ఆ క్రికెటర్ తో గిల్ కు సన్నిహిత సంబంధం.. వీడియో వైరల్

గిల్ పాడుతుంటే కిషన్ అతడికి సన్నిహితంగా మెదిలాడు. వారిద్దరూ ఒకరినొకరు రాసుకు పూసుకు తిరిగారు. దీంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. " అనవసరంగా సచిన్ కూతురు టెండూల్కర్ పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ గిల్ కిషన్ తో సన్నిహితంగా ఉంటున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 10, 2024 / 04:21 PM IST

    Shubman Gill Birthday celebrations

    Follow us on

    Shubman Gill : టీమిండియా యువ ఆటగాడు శుభ్ మన్ గిల్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా మధ్య ఏదో ఉందని.. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని.. పలుమార్లు ముంబై హోటల్లో కనిపించారని.. జాతీయ మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు అనేక రకాల కథనాలు ప్రచారమయ్యాయి.. ప్రసారమయ్యాయి.. ప్రచురితమయ్యాయి.. కానీ ఇంతవరకు గిల్ నోరు విప్పింది లేదు..సారా మాట్లాడిందీ లేదు. దీంతో అవన్నీ ఊకదంపుడు కబుర్లని.. పసలేని ప్రచారాలని కొట్టి పారేసిన వారు ఉన్నారు. అయితే గిల్ కు సారాతో కాదు.. ఒక క్రికెటర్ తో సంబంధం ఉందని.. ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.

    టీమిండియా యువ ఆటగాడు గిల్ 25వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తన జన్మదినాన్ని సెప్టెంబర్ 8 ఆదివారం బెంగళూరులో ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకకు తన తోటి ఆటగాళ్లు హాజరయ్యారు. దులీప్ ట్రోఫీలో భాగంగా గిల్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. అతడు ఇండియా – ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఇండియా – బీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా – ఏ జట్టు ఓడిపోయింది. తన జట్టు ఓడిపోయినప్పటికీ తోటి ఆటగాళ్లతో ఆదివారం రాత్రి జన్మదిన వేడుకలను గిల్ జరుపుకున్నాడు. ఈ పార్టీకి టీమిండియా యువ ఆటగాళ్లు ఈశాన్ కిషన్, కేఎల్ రాహుల్, ఇతర ఆటగాళ్లు హాజరయ్యారు. వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పీకల దాకా తాగిన ఆటగాళ్లు చిందేశారు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. కొంతమంది ఆటగాళ్లు మైకు చేతుల్లోకి తీసుకొని తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టారు. గిల్ సింగర్ అవతారం ఎత్తడు. తనకు నచ్చిన పాటలు పాడి స్నేహితులను అలరించాడు. గిల్ పాడుతుంటే ఈశాన్ కిషన్ డ్యాన్స్ వేశాడు.

    సన్నిహితంగా..

    గిల్ పాడుతుంటే కిషన్ అతడికి సన్నిహితంగా మెదిలాడు. వారిద్దరూ ఒకరినొకరు రాసుకు పూసుకు తిరిగారు. దీంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ” అనవసరంగా సచిన్ కూతురు టెండూల్కర్ పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ గిల్ కిషన్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. దానికి బ్రోమాన్స్ అని పేరు పెట్టాలి. పాపం ఈ వీడియో చూస్తే సారా ఏమవుతుందో” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తొడ కండరాల గాయం వల్ల కిషన్ దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్ లో ఆడలేదు. మరో వైపు బంగ్లా సిరీస్ కు కూడా కిషన్ కు అవకాశం లభించలేదు. కేఎల్ రాహుల్, గిల్ మాత్రం తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. ఫలితంగా దులీప్ ట్రోఫీలో రెండవ రౌండ్ మ్యాచ్ లకు వీరు గైర్హాజరుకానున్నారు. సెప్టెంబర్ 12న బీసిసిఐ నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్, రాహుల్ ఆడతారు.. ఇక బంగ్లా తో జరిగే టెస్టులో జట్టులోకి కొత్తగా ఆకాష్ దీప్, యష్ దయాల్ వచ్చారు. ఇక మిగతా స్టార్ ఆటగాళ్లు బంగ్లా సిరీస్ ద్వారా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బుమ్రా ను కూడా ఎంపిక చేసి బీసీసీఐ సెలక్షన్ కమిటీ అందర్నీ ఆశ్చర్యపరిచింది.. ఈసారి బ్యాకప్ కీపర్ గా ధ్రువ్ జూరెల్ కు అవకాశం లభించడం విశేషం.