https://oktelugu.com/

Pathum Nissanka :  జయసూర్య అవకాశం ఇస్తే..ఇతడేం చేస్తాడనుకున్నారు.. కానీ ఆ ఆటగాడు 144 ఏళ్ల చరిత్రను బద్దలు కొట్టాడు..

నిస్సాంకను ఓపెనింగ్ ఆటగాడిగా జయ సూర్య ప్రకటించడంతో అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూశారు.. ఇదేంటి జయసూర్యకు చిప్ ఏమైనా దొబ్బిందా? అంటూ వ్యాఖ్యానించారు. నవ్వినా నాప చేను పండుతుందనే సామెత తీరుగా.. నిస్సాంక నిలబడ్డాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 10, 2024 / 04:09 PM IST

    Pathum Nissanka

    Follow us on

    Nissanka : అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ చూడరు. అది జరిగిన తర్వాత ఇంకెవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. చదువుతుంటే ఖలేజా సినిమాలోని త్రివిక్రమ్ రాసిన డైలాగ్ గుర్తుకొస్తుంది కదూ.. ఈ డైలాగు అచ్చు గుద్దినట్టు ఈ శ్రీలంక క్రికెటర్ కు సరిపోతుంది. ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో శ్రీలంక ఓడిపోయింది. దీంతో మూడో టెస్ట్ జట్టును ఎంపిక చేసే విషయంలో కోచ్ జయ సూర్య పై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో అతడు తట్టుకోలేక నిస్సాంక కు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది.

    నిస్సాంకను ఓపెనింగ్ ఆటగాడిగా జయ సూర్య ప్రకటించడంతో అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూశారు.. ఇదేంటి జయసూర్యకు చిప్ ఏమైనా దొబ్బిందా? అంటూ వ్యాఖ్యానించారు. నవ్వినా నాప చేను పండుతుందనే సామెత తీరుగా.. నిస్సాంక నిలబడ్డాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా సెంచరీ కొట్టేశాడు. శ్రీలంక జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో గెలిపించాడు. ఇంగ్లాండ్ గడ్డపై సింహళీయుల పరువును నిలబెట్టాడు.

    అరుదైన ఘనత

    నిస్సాంక సెంచరీ చేసే కంటే ముందు అద్భుతమైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో 42 బంతుల్లోనే అర్ద శతకం కొట్టేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ మ్యాచ్ లలో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి అత్యంత వేగంగా అర్ద సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా నిస్సాంక చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం నిస్సాంక వయసు 26 సంవత్సరాలు.. 1880 లో ఇంగ్లాండ్ దేశంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ దేశం 559 టెస్ట్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చింది. అయితే ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఇలా రెండు ఇన్నింగ్స్ లలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన దాఖలాలు లేవు.. అయితే అత్యంత వేగంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో నిస్సాంక తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

    రెండు హాఫ్ సెంచరీల ఘనత వీరి సొంతం

    జింబాబ్వే పై న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ గ్రేట్ బుచ్ 1992లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 1996లో వెస్టిండీస్ జట్టు పై న్యూజిలాండ్ ఆటగాడు నాథన్, 2009లో న్యూజిలాండ్ మీద శ్రీలంక ఆటగాడు తిలక రత్న దిల్షాన్, 2012లో న్యూజిలాండ్ జట్టు మీద వెస్టిండీస్ ఆటగాడు గేల్, 2016లో టీమిండియా మీద వెస్టిండీస్ ఆటగాడు బ్లాక్ వుడ్, 2017లో పాకిస్తాన్ జట్టు మీద ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, 2022లో పాకిస్తాన్ మీద ఇంగ్లాండ్ ఆటగాడు క్రాలే, 2023లో న్యూజిలాండ్ మీద ఇంగ్లాండ్, 2024 లో ఇంగ్లాండ్ మీద శ్రీలంక ఆటగాడు నిస్సాంక.. రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు.. అది కూడా తక్కువ బంతుల్లో చేశారు.