Damien Martyn: ఇటీవల యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నాలుగో టెస్టులో తలపడ్డాయి. ప్రతిష్టాత్మకమైన మెల్ బోర్న్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పర్యాటక ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో బాధలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు.. మరో షాకింగ్ పరిణామం ఎదురైంది.
ఆస్ట్రేలియా జట్టులో ఒకప్పుడు లెజెండ్ క్రికెటర్ గా కొనసాగిన డామియన్ మార్టిన్ బాక్సింగ్ డే టెస్ట్ రోజున కోమాలోకి వెళ్లిపోయాడు. మార్టిన్ వయసు 54 సంవత్సరాలు. కొంతకాలంగా అతడు మైనింజైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. 1992 నుంచి 2006 వరకు ఆస్ట్రేలియా జట్టు తరఫున 67 టెస్ట్ లు ఆడాడు. ఆస్ట్రేలియా జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా సంవత్సరాల పాటు కొనసాగిన అతడు సరిగ్గా 2006లో రిటర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలలో అతడు పాలుపంచుకున్నాడు. ప్రస్తుతం మార్టిన్ వయసు 54 సంవత్సరాలు.
మార్టిన్ కొంతకాలంగా మెనింజైటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని బాక్సింగ్ డే టెస్టు రోజు క్వీన్స్ లాండ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో ఉన్నాడు. వ్యాధి తీవ్రత పెరిగిన నేపథ్యంలో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. మార్టిన్ 1992 నుంచి 2006 వరకు ఆస్ట్రేలియా 67 టెస్టులు ఆడాడు. 46.37 సగటుతో 4,406 పరుగులు చేశాడు. 2003లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు మీద అజేయంగా 88 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మ్యాచ్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2005, 2006లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇబ్బంది పడ్డాడు. తొలి రెండు టెస్టులలో విఫలం కావడంతో.. అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మార్టిన్ చికిత్స పొందుతున్న క్వీన్స్ ల్యాండ్ ఆసుపత్రికి అతని సహచరులు గిల్ క్రిస్ట్, ఏ ఎఫ్ ఎల్ మాజీ ఆటగాడు బ్రాడీ హార్డీ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు లెహమాన్ వచ్చారు. మార్టిన్ సతీమణి అమండ ను పరామర్శించారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. ప్రస్తుతం అభిమానులు అతని కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని.. కష్టకాలంలో ఇవి అతని కుటుంబానికి ఎంతగానో భరోసా ఇస్తాయని ఆస్ట్రేలియా మీడియా తన కథనంలో పేర్కొంది.
Lots of love and prayers sending @damienmartyn way . Keep strong and fighting legend . Love to the family xxx ❤️
— Darren Lehmann (@darren_lehmann) December 30, 2025