Shreyas Iyer Mature Performance శ్రేయస్ అయ్యర్ ఈ కాలపు ఆటగాడు. ఉద్రేకం, ఉత్సాహం ఎక్కువగా ఉన్న ఆటగాడు. అయినా సరే హార్దిక్ జట్టుతో గెలిచిన తర్వాత సైలెంట్ గానే ఉన్నాడు. సెకండ్ డౌన్ ఆటగాడిగా వచ్చి.. చివరి వరకు మైదానంలో పాతుకుపోయాడు. కీ ప్లేయర్లు మొత్తం వరుస పెట్టి అవుట్ అవుతున్నప్పటికీ.. అతడు మాత్రం ధైర్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా.. ఏమాత్రం జట్టును ఒత్తిడికి గురి కాకుండా నడిపించాడు. సాధారణంగా ఒత్తిడితో కూడుకొని ఉండే క్రికెట్లో ఇలాంటివి సాధ్యం కాదు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అస్సలు సాధ్యం కాదు. ఉదాహరణకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తీసుకుంటే.. కీలక దశలో అతడు చాలా ఒత్తిడికి గురయ్యాడు. బౌలర్లను ప్రయోగించడంలో విఫలమయ్యాడు. కానీ అంతకుమించి ఒత్తిడి ఉన్న సమయంలో అయ్యర్ మాత్రం జస్ట్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
Also Read : చెప్పినట్టుగానే యుద్ధమే చేశాడు.. విజయంతో ముగించాడు.. అదీ అయ్యర్ అంటే!
టీమిండియాలో ధోని నిశ్శబ్దంగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఓడిపోయినప్పటికీ.. దారుణమైన స్థితిలో పడిపోయినప్పటికీ.. అంతకు మించిన విజయాన్ని సాధించినప్పటికీ.. ఆకాశమే హద్దుగా చెలరేగే సందర్భం ఎదురుగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం పట్టించుకోడు. తన పాత్ర తాను నిర్వహించి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. అందులో నవ్వు కనిపించదు. కోపం కనిపించదు. విసుగు అంతకన్నా కనిపించదు. తోటి ఆటగాళ్లపై పెత్తనం కూడా కనిపించదు. ఒక రకంగా కర్మయోగి అనే పదానికి ధోని నిర్వచనంగా కనిపించాడు. దానిని చివరి వరకు కొనసాగించాడు. ఇప్పుడు ఇదే ధోరణి అయ్యర్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రీతి జింటా జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు.. తొలిసారిగా ఆ జట్టును చివరి అంచే పోటీ వరకు తీసుకెళ్లాడు. బలమైన హార్దిక్ జట్టును మట్టికరిపించాడు. అంతేకాదు. కన్నడ జట్టుతో భారీ తేడాతో ఓడిపోయినప్పటికీ.. ఆ ప్రభావం హార్దిక్ జట్టుతో జరిగిన పోటీలో ఏమాత్రం కనిపించకుండా చూసుకున్నాడు. అద్భుతం, అనన్య సామాన్యం, అనితర సాధ్యం అనే స్థాయిలో బ్యాటింగ్ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ టోర్నీలో అద్భుతమైన రికార్డులు సృష్టించి.. పంజాబ్ జట్టును శిఖర స్థానంలో నిలిపాడు.
ప్రీతి జింటా జట్టును తుది అంచె పోటీల వరకు తీసుకెళ్లిన తర్వాత అయ్యర్ పై ప్రశంసల జలు కురుస్తున్నాయి. అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అయ్యర్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. తన ఇంకా ఏదో సాధించాలి అనే సంకేతాలు ఇస్తున్నాడు. బహుశా అతడి మనోభావాలు ఎలా ఉన్నాయో తోటి ప్లేయర్లకు కూడా అర్థమైంది అనుకుంటా. అందువల్లే అతడి మానాన అతడిని వదిలేశారు. వారు మాత్రం విజయం సాధించిన క్రమంలో సంబరాలలో మునిగిపోయారు.