Shreyas Iyer Ipl Qualifier 2 : ఈ దశలో వచ్చిన తెలుగు వాడు తిలక్ వర్మ(44), అంతకుముందు మైదానంలో ఉన్న మరో ఓపెనర్ బెయిర్ స్టో(38) దుమ్మురేపారు.. సూర్య కుమార్ యాదవ్(44), నమన్ ధీర్(37) చెలగిపోవడంతో హార్దిక్ పాండ్యా 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. ఆరు వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. 204 పరుగుల టార్గెట్ తో చేజింగ్ మొదలుపెట్టిన పంజాబ్ జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభం లభించలేదు. భీకరమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (6) బౌల్ట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (20), జోస్ ఇంగ్లిస్(38), నెహల్ వదెరా (48) అదరగొట్టడంతో పంజాబ్ జట్టు ముంబైకి దీటుగా సమాధానం చెప్పింది. అయితే కీలకమైన దశలో వీరంతా అవుట్ కావడంతో జట్టును ఎలాగైనా సరే విజయతీరాలకు చేర్చాలని భావించిన కెప్టెన్ అయ్యర్.. ప్రారంభంలో నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మిగతా బ్యాటర్లు ముంబై బౌలర్లు పన్నిన ఉచ్చులో చిక్కుకోగా.. పంజాబ్ జట్టు సారధి (87) మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ముంబై బౌలర్ల పై తన ఆగ్రహాన్ని మొత్తం చూపించాడు. బుమ్రా, అశ్వని కుమార్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్ ఇలా ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రారంభంలో నిదానంగా.. ఆ తర్వాత తన ప్రతాపాన్ని ఒక్కసారిగా చూపించి.. తనను ఎందుకు ఐపీఎల్లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ అంటారో మరోసారి నిరూపించుకున్నాడు..
నిజంగానే యుద్ధాన్ని చేశాడు..
ఈ సీజన్లో ప్రారంభంలో ఓటములు ఎదుర్కొన్న ముంబై జట్టు ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించింది.. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వచ్చింది. బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా ప్రత్యర్థి జట్లపై ఎదురు దాడికి దిగడం మొదలుపెట్టింది. ఇదే సూత్రాన్ని పంజాబ్ మీద కూడా ముంబై ప్రయోగించింది. కానీ అది ఏమాత్రం విజయవంతం కాలేకపోయింది. వాస్తవానికి పంజాబ్ స్థానంలో మరే జట్టు ఉన్నా ఇబ్బంది ఎదురయ్యేది. పంజాబ్ జట్టు సారథి అయ్యర్ మాత్రం బలంగా అనుకున్నాడు. స్థిరంగా నిలబడ్డాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి.. పరుగుల వరద పారించాడు. ముంబై జట్టు విధించిన లక్ష్యాన్ని నెమ్మదిగా నెమ్మదిగా కరిగించు కుంటూ వచ్చాడు. ఏ దశలోనూ పోరాటాన్ని ఆపలేదు. కొన్ని ఓవర్లలో నిదానంగా పరుగులు చేసినప్పటికీ.. తన లక్ష్యాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళించలేదు. ఇటీవల క్వాలిఫైయర్ -1 లో కన్నడ జట్టు చేతిలో పంజాబ్ దారుణంగా ఓడిపోయింది. ఆ సమయంలో అయ్యర్ ఒకింత బాధపడినప్పటికీ.. తన అసలు టార్గెట్ ఏమిటో చెప్పేశాడు.” మేము మ్యాచ్ మాత్రమే ఓడిపోయాం. యుద్ధం నుంచి కాదు.. మా యుద్ధం మేము కొనసాగిస్తామని” అయ్యర్ వ్యాఖ్యానించాడు.. అంటే ఈ లెక్కన తన ఉద్దేశం ఏమిటో అప్పుడే అయ్యర్ చెప్పేశాడు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో దానిని ఎగ్జిక్యూట్ చేశాడు. ఏమాత్రం భయపడలేదు. భావోద్వేగానికి గురి కాలేదు. ప్రత్యర్థి బౌలాలపై ఆ కారణంగా విమర్శలు చేయలేదు. తోటి ఆటగాళ్లు కీలకమైన సందర్భంలో పెవిలియన్ చేరుతున్నప్పటికీ.. ఆగ్రహానికి గురి కాలేదు. తనలో ఉన్న అన్ని కోణాలను చూపించి ముంబై జట్టుకు నిద్రలేని రాత్రిని అయ్యర్ పరిచయం చేశాడు. మైదానంలో మ్యాచ్ చూస్తున్న ముంబై జట్టు యజమానులు అనంత్ అంబానీ, నీతా అంబానీ కి తీవ్రమైన విచారాన్ని మిగిల్చాడు.
THE WINNING SIX BY SHREYAS IYER pic.twitter.com/TuEE4yvGm4
— Johns. (@CricCrazyJohns) June 1, 2025