Covid Cases In India: భారతదేశంలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గుణాంకాల ప్రకారం జూన్ 2న ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3900 మార్కును దాటింది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 24 గంటల్లో 360 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కేసులపై ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పందిస్తూ ఇత వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైనది కాదని తెలిపింది.