Shreyas Iyer: ఐపీఎల్ మెగా వేలం పూర్తయింది. ఆటగాళ్ల కొనుగోలు జరిగిపోయింది. ఫ్రాంచైజీల పోటీతో ఆటగాళ్లకు నిరుటి కన్నా తక్కువ ధర రావడం తెలిసిందే. దీంతో వారి ప్రతిభ తగ్గిందా? లేక ఫ్రాంచైజీల చొరవ తక్కువయిందా? తెలియడం లేదు. మొత్తానికి ఆటగాళ్ల వేలం అంకం రేపటితో ముగియనుంది. ఇందులో హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం ఏ ఆటగాడిని కొనుగోలు చేయలేదు. దీంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వ్యూహమేంటో అర్థం కావడం లేదు.

ఆటగాళ్ల వేలంలో శ్రేయస్ అయ్యర్ ఎక్కువ ధర పలకడం తెలిసిందే. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఇతడు ప్రస్తుతం కోల్ కత నైట్ రైడర్స్ కు సొంతమయ్యాడు. వేలంలో ఎక్కువ ధర చెల్లించి కోల్ కత గెలుచుకుంది. ఇతడి కోసం గుజరాత్ టైటాన్స్ పోటీపడినా కోల్ కత దక్కించుకోవడం విశేషం. గత ఏడాది రూ. 7 కోట్లు తీసుకున్న ఇతడు ఈసారి మాత్రం రూ. 12.25 కోట్లు పొందడం గమనార్హం.
Also Read: ఐపీఎల్ వేలంలోనే అత్యధిక ధర పలికిన ఇషాన్ కిషన్..!
భారీ ఆశలు పెట్టుకున్న రవిచంద్రన్ అశ్విన్, డేవిడ్ వార్నర్ లు సైతం తక్కువ ధరకే అమ్ముడుపోవడం తెలుస్తోంది. ఇంతకుముందు ఢిల్లీ తరఫున ఆడిన అశ్విన్ రూ. 7.60 కోట్ల తీసుకున్నా ఈసారి మాత్రం రాజస్తాన్ రూ.5 కోట్లు వెచ్చించి అశ్విన్ ను తమ జట్టులోకి తీసుకుంది. ఇక డేవిడ్ వార్నర్ ను కూడా రాయల్ చాలెంజర్స్ సొంతం చేసుకోవాలని భావించింది.

వార్నర్ ను చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు తమ జట్టులోకి తీసుకుంది. దీంతో గతంలో కన్నా ఆటగాళ్లకు తక్కువ ధర రావడం తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ లో అద్భుతాలు చేయాలని ఆటగాళ్లు చూస్తున్నారు. తమ జట్టుకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను ప్రాక్టీసు ముమ్మరంగా చేసి ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేస్తున్న రోజా.. కారణమేంటబ్బా..?