Shreyas Iyer : అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ మరోసారి దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఇండియా – ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సున్నా చుట్టి వచ్చాడు. ఏకంగా ఏడు బంతులు ఎదుర్కొని.. ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో బంతిని తప్పుగా అంచనా వేసి.. పేలవమైన షాట్ కొట్టాడు. అది మిడాన్ లో లేచింది. దీంతో ఆ బంతిని అక్కడే కాచుకుని ఉన్న అకీబ్ అద్భుతంగా ఆదుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్ళాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా – డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. అయ్యర్ అవుట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ” సన్ గ్లాసెస్ ధరించాడు. పైగా ఇతడు గౌతమ్ గంబీర్ శిష్యుడు. హీరో లాగా మైదానంలోకి వచ్చాడు. 0 పరుగులకు అవుట్ అయ్యి.. జీరో లాగా మారాడని” నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.. అయితే అనంతపురంలో ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అతడు సన్ గ్లాసెస్ ధరించాడని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి బ్యాటింగ్ కు సన్ గ్లాసెస్ ధరించరు. కానీ అయ్యర్ సన్ గ్లాసెస్ ధరించడం నెట్టింట చర్చకు దారితీస్తోంది అలా అతడు సన్ గ్లాసెస్ ధరించి మైదానంలోకి రావడం.. కాసేపటికి అవుట్ కావడంతో విమర్శలు ప్రారంభమయ్యాయి.
ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ అనంతరం..
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత అయ్యర్.. టెస్ట్ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నప్పటికీ అతడికి జట్టులో అవకాశం లభించడం లేదు. పైగా ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ అయ్యర్ పెద్దగా ప్రభావం చూపించలేదు.. గౌతమ్ గంభీర్ శిష్యుడు అనే మార్క్ ఉన్నప్పటికీ.. అతడికి పెద్దగా అవకాశాలు లభించడం లేదు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటైనా జాతీయ జట్టులోకి ప్రవేశించాలనుకుంటున్న తరుణంలో.. పేలవమైన షాట్లు ఆడి అయ్యర్ పరువు తీసుకుంటున్నాడు.
మంచి ఆటగాడయినప్పటికీ..
వాస్తవానికి అయ్యర్ మంచి ఆటగాడు. అటాకింగ్ బ్యాటింగ్ అతడి సొంతం. కానీ గత కొంతకాలం నుంచి సరైన స్థాయిలో అతడు ఆడలేక పోతున్నాడు. షాట్ల ఎంపికలో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ.. అదే జోరు కొనసాగించలేకపోతున్నాడు. దీనివల్ల అవకాశాలను కోల్పోతున్నాడు. వర్ధమాన ఆటగాడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న అతడు.. దేశవాళీ క్రికెట్ లో విఫలమవుతున్న తీరును అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అవకాశాలు లభించినప్పటికీ.. వాటిని సరైన స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాడని.. అసలే టీమిండియాలో ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉందని.. ఇలాంటి సమయంలో తన ఆట తీరు మార్చుకుంటేనే శ్రేయస్ అయ్యర్ కు భవిష్యత్తు ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
&
Shreyas Iyer dismissed for a duck in Duleep Trophy 2024 pic.twitter.com/MXJb4IvkKW
— Dev Sharma (@Devsharmahere) September 13, 2024