Ind Vs Pak Asia Cup: పాలస్తీనా పక్షాన ఓటు వేసిన భారత్ .. కమ్యూనిస్టు దేశాలతో సఖ్యత కుదుర్చుకున్న భారత్.. మరి పహల్గాం లాంటి దారుణానికి పాల్పడ్డ పొరుగు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం కరెక్టేనా? ఇప్పుడు మేధావులు, కొందరు క్రికెట్ అభిమానుల నుంచి వెలువడుతున్న ప్రశ్న ఇదీ.. ముల్లును ముల్లుతోనే తీయాలి.. వాళ్లు యుద్ధం చేస్తామంట యుద్ధమే చేయాలి. దొంగదెబ్బ తీస్తామంటే చావుదెబ్బ తీయాలి. కానీ అంతర్జాతీయ వేదికలపైమాత్రం భారత్ ఆడాలనే అందరి అభిప్రాయం. పాక్ తో తెగదెంపుల నుంచి ఈరోజు ఆసియా కప్ లో క్రికెట్ వరకూ.. ఈ రెండు నెలల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఈ మార్పులు యాదృచ్ఛికం కాదు, మానవతా విలువలకు, వాస్తవికతకు ప్రతీకలు.
Also Read: మిరాయి ని తొక్కెయాలని చూస్తున్న స్టార్ హీరోలు…ఇదే సాక్ష్యం…
మానవతా దృక్పథం ఎప్పటికీ ఆపన్నులకు అండగా నిలుస్తుంది. క్రీడలు మాత్రం స్నేహానికి, సౌభ్రాతృవానికి మార్గాలు చూపుతాయి. యుద్ధం కన్నా ఆట బాటలు ఎప్పుడూ మంచివి. జాతులు ఎదగాలంటే నిర్మాణాత్మక సంబంధాలు అవసరం. క్రికెట్ మైదానం అందుకు ఒక వేదికగా నిలుస్తుంది.
అయితే మన మీడియా ఈ సంఘటనను “సమరం” అనే పదంతో అలంకరించడం గమనార్హం. యుద్ధం, శత్రుత్వం అనే భావనలను ఆటపాటల్లోనూ నింపడం అనవసరం. క్రికెట్ ఒక ఆట మాత్రమే, కానీ దానిని యుద్ధ భాషలో వర్ణించడం సమాజంలో అపార్థాలు పెంచుతుంది.
ఆటలో గెలుపు–ఓటములు సహజం. కానీ క్రికెట్ మైదానంలో శత్రువులనుకున్న రెండు దేశాల ప్రజలు ఒకే చోట కూర్చుని జెండాలు ఊపుతూ, కేరింతలు కొడుతూ ఆనందించడం మరింత గొప్ప దృశ్యం. శాంతి, సౌభ్రాతృవం ఇలాగే మొదలవుతాయి.
కాబట్టి క్రికెట్ మ్యాచ్ను “సమరం”గా కాకుండా, “స్నేహ యాత్ర”గా చూడాలి. ఎందుకంటే బందూకులు ఆగిన చోట బ్యాట్–బంతులు మెలిగితే, జాతుల మధ్య వంతెనలు నిర్మాణమవుతాయి. ఇదే నిజమైన విజయం.