Shah Rukh Khan: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక బాలీవుడ్ బాద్షా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న షారుక్ ఖాన్ లాంటి నటుడు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…సినిమా హీరో గా సినిమాలు చేయడమే కాకుండా జనాలకి ఆపద వచ్చిన ప్రతిసారి షారుక్ ఖాన్ ఎంతోకొంత సహాయాన్నైతే అందిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి సహాయాన్ని అందించాడు. పంజాబ్ లో వచ్చిన వరదల ధాటికి అక్కడి జనాలు విలవిల్లాడిపోతున్నారు. ఇక దాన్ని చూసిన షారుక్ ఖాన్ వాళ్లకు చాలా రకాలుగా సేవలను అందిస్తూ వాళ్లకు కావాల్సిన కనీస సౌకర్యాలను సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడు… ఇక అలాగే తన ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సహాయ సహకారాలను కూడా అందిస్తున్నాడు. ఇదే విషయం మీద సన్నిడియోల్ హీరోగా వచ్చిన 1993 సినిమాలో షారుక్ ఖాన్ విలన్ గా నటించాడు. సన్నీడియోల్ మాత్రం హీరోగా చేశాడు. ఇక అందరికీ సహాయ సహకారాలను అందించి వాళ్ళందరినీ కాపాడే క్యారెక్టర్ లో నటించాడు.
ఇక ఇప్పుడు ఈ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ షారుక్ ఖాన్ ఆ సినిమాలో విలన్ అయినప్పటికి నిజ జీవితంలో మాత్రం హీరోలా మారాడు. సన్నీ డియోల్ ఆ సినిమాలో హీరో అయినప్పటికి వరద బాధితులకు సహాయంగా నిలవలేకపోయాడు అంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, సోను సూద్, హర్భజన్ సింగ్ లాంటి వారు పంజాబ్ ప్రజలకు అండగా నిలబడి వాళ్లను కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా సినిమా హీరోలు అంటే మూవీస్ చేసి కోట్లలో డబ్బులు సంపాదించడం కాదు. ఆపద వచ్చిన సమయంలో వాళ్లను ఆదుకునే ప్రయత్నం కూడా చేయాలి. అలాంటప్పుడే జనాలకి హీరోల మీద ఇష్టం పెరుగుతోంది.
మనకు ఏదైనా జరిగితే వాళ్లు మనకు అండగా నిలుస్తారనే భరోసా పెరుగుతోంది. తద్వారా వాళ్ళ సినిమాలు చూడడానికి ఎక్కువ మంది జనాలు ఆసక్తి చూపించే అవకాశాలు కూడా ఉంటాయి… వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితేనే నటులు రీల్ హీరోలు గానే కాకుండా రియల్ హీరోగా కూడా జనాల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…