Mahavatar Narsimha: సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో సినిమాలు వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు… ముఖ్యంగా ఒక హీరో తన ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయి డిఫరెంట్ కథలను చేయలేక రొటీన్ సినిమాలు చేసినప్పుడు ఆ హీరో యొక్క సినిమాలు తిప్పి కొట్టిన జనాలు మంచి కథతో వచ్చిన చిన్న హీరోని సైతం ఆదరిస్తారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు రెగ్యూలర్ సినిమాలనే కాకుండా యానిమేషన్ సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరించిన విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేస్తుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో మహావతార్ నరసింహ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ అయితే చేశారు. జులై 25 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం 50 రోజులు పూర్తిచేసుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…200 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా 50 రోజులు ఆడటం లేదు.
Also Read: మిరాయి ని తొక్కెయాలని చూస్తున్న స్టార్ హీరోలు…ఇదే సాక్ష్యం…
అలాంటిది మహా అవతార్ నరసింహ సినిమా ఓటిటిలో రిలీజ్ అయిన కూడా ఈ సినిమా 200 థియేటర్లలో ఆడుతోంది అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పటికి ఈ సినిమాను జనాలు ఆదరిస్తున్నారు. 350 కోట్లకు పైన కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా 400 కోట్ల మార్కు ను కూడా టచ్ చేస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ వల్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఒక యానిమేషన్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లను రాబడటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక రీసెంట్ టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ‘దేవర’, రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చేంజర్’ లాంటి సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సాధించలేదు.
ఇక వీళ్ళ సినిమాలు థియేటర్లలో 50 రోజులు ఆడిన సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అనే చెప్పాలి. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ‘మహావతార్ నరసింహా’ మూవీ భారీ రికార్డులను సినిమా క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…