Shoaib Malik Fourth Marriage: నేటి కాలంలో సరైన ఈడు ఉన్నప్పటికీ జోడు దొరకడమే కష్టంగా మారుతుంది. ఎన్ని రకాలుగా అర్హతలు ఉన్నప్పటికీ.. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ చాలామంది యువకులకు వివాహం జరగడం లేదు. దీంతో వారంతా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.. ఒంటరి జీవితాన్ని సాగించలేక.. జీవితంలో తోడుంటూ లేక.. భారంగా లైఫ్ ను సాగిస్తున్నారు. కానీ ఇతడు మాత్రం.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఒకప్పుడు షోయబ్ మాలిక్ అనే ఆటగాడు ఉండేవాడు. ఇతడు అద్భుతంగా ఆడేవాడు. పాకిస్తాన్ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు. అప్పట్లో ఇతడికి వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం భారతదేశానికి చెందిన సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. ఇతడి ద్వారా సానియా మీర్జా ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత మాలిక్ సానియాకు విడాకులు ఇచ్చాడు.
మాలిక్ విడాకులు ఇచ్చిన తర్వాత సానియా తన కుమారుడితో దుబాయిలో నివాసం ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణలోని హైదరాబాదులో టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసింది. అప్పుడప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు తన కుమారుడితో కలిసి హాజరవుతోంది. షోయబ్ మాలిక్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అతడికి ఈమెకు వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ.. వివాహం జరిగింది. రెండు సంవత్సరాలు ఆమెతో కాపురం చేసిన తర్వాత విడాకులు ఇచ్చాడు మాలిక్. ఇప్పుడు ఇతడి గురించి మరో వార్త పాకిస్తాన్ మీడియాలో వినిపిస్తోంది.
షోయ మాలిక్ పాకిస్తాన్ నటి కుబ్ర ఖాన్ ను జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా మాలిక్ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ.. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరువైపుల పెద్దలు వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరికి వివాహం జరుగుతుందని సమాచారం. ఇప్పటికే ముగ్గురుని పెళ్లాడిన మాలిక్.. నాలుగో వివాహానికి సిద్ధం కావడం పట్ల గ్లోబల్ మీడియాలో వ్యంగ్యంగా వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి. మాలిక్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా ఒంటరిగానే ఉంటున్నది. అప్పట్లో ఆమెకు మహమ్మద్ షమితో వివాహం జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కూడా నిరాధారమని తేలిపోయాయి.
