https://oktelugu.com/

Shivam Dube: రోహిత్ శర్మ వ్యాఖ్యలు.. శివం దూబే కు నిద్రలేని రాత్రులు.. తర్వాత ఏం జరిగిందంటే..

వాస్తవానికి శివం దూబే ప్రతిభావంతమైన ఆటగాడు. కానీ, స్థిరత్వం లేకపోవడంతో అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. గత ఏడాది ఐపిఎల్ లో అద్భుతంగా ఆడాడు. స్పిన్ హిట్టర్ గా తనను తాను ఆవిష్కరించుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 2, 2024 / 01:30 PM IST

    Shivam Dube

    Follow us on

    Shivam Dube: జూన్ 2న అమెరికా, వెస్టిండీస్ మధ్య ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన భారత జట్టులో శివం దూబే ఒకడు. ప్రస్తుతం చెన్నై జట్టు తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ చెన్నై జట్టు సాధిస్తున్న విజయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అటు బ్యాట్, ఇటు బంతితో రాణించగల సత్తా దూబే సొంతం. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో స్థానం దక్కడంతో శివం దూబే ఆనందానికి అవధులు లేవు. అయితే టీమిండియాలో శివం దూబే చోటు దక్కించుకోవడం వెనుక పెద్ద కథ నడిచింది. అన్నింటి కంటే ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అన్న మాటలు శివం దూబే మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. దీనివల్ల అతడు నిద్రలేని రాత్రులు గడిపాడు.

    వాస్తవానికి శివం దూబే ప్రతిభావంతమైన ఆటగాడు. కానీ, స్థిరత్వం లేకపోవడంతో అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. గత ఏడాది ఐపిఎల్ లో అద్భుతంగా ఆడాడు. స్పిన్ హిట్టర్ గా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఆ సంవత్సరం చెన్నై జట్టు ఐపిఎల్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది అతడు 418 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ లో అదరగొట్టినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించేందుకు ఈ ఏడాది జనవరి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. స్వదేశంలో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో లభించిన అవకాశాన్ని శివం దూబే సమర్థవంతంగా వినియోగించుకున్నాడు.. వరుసగా రెండు అజేయ అర్ధ సెంచరీలు సాధించాడు. ఒక మ్యాచ్లో ఒక పరుగు మాత్రమే చేశాడు. మొత్తంగా (60*, 63*) 124 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపిక అయ్యాడు. అంతేకాదు ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేశాడు. అప్పట్లో శివం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు ఎంపికైనప్పుడు రోహిత్ శర్మ అతనితో మాట్లాడాడు. ” నీకు ఈ సిరీస్ లో బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. అసలు ముందు నువ్వు ఏం చేయగలవు నాకు చెప్పు” అని రోహిత్ శర్మ ఆదేశించాడు. దీంతో శివమ్ తన బ్యాటింగ్, బౌలింగ్ తో రోహిత్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం గా చెప్పాడు.

    ప్రస్తుత ఐపీఎల్ లో శివం దూబే అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు.. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్లాసెన్(28), అభిషేక్ శర్మ (27), తర్వాత మూడవ స్థానంలో (26) శివం ఉన్నాడు. 2023 కి ముందు శివం దూబే రాజస్థాన్ జట్టుకు ఆడేవాడు. ఆ తర్వాత చెన్నై జట్టుకు మారాడు. తన బ్యాటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ” నేను చెన్నై జట్టుకు వచ్చినప్పుడు మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ బ్యాటింగ్ చేసే విధానంలో అనేక సలహాలు ఇచ్చారు. గట్టి ఇన్నింగ్స్ ఆడాలని నాకు సూచించారు. అలా వారు నాపై నమ్మకం ఉంచారు. అందువల్లే ఈ స్థాయిలో రాణించగలుగుతున్నాను. ఒక బౌలర్ నిర్దిష్టంగా ఎలాంటి బంతులు వేస్తున్నాడు? నేను వాటిని ఎలా ఆడుతున్నాను? అనే ప్రశ్నలు వేసుకొని నన్ను నేను మార్చుకున్నాను.. ఈ మార్పునకు కారణం కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.” అని శివం వ్యాఖ్యానించాడు.

    ప్రస్తుతం శివమ్ ఆటతీరును చాలామంది సీనియర్ ఆటగాళ్లు యువరాజు సింగ్ తో పోల్చుతున్నారు.. మొదటి తొమ్మిది, పది బంతుల్లో యువరాజ్ సింగ్ పెద్దగా పరుగులు చేయడు. ఆ తర్వాత అతడు తన అసలు సిసలైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. శివం దూబే కూడా అలానే ఆడతాడు. ఆ తర్వాత తన ఫామ్ దొరకబుచ్చుకొని, బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాడని.. సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని శివం దూబేకు సూచిస్తున్నారు.